ప్రతి మనిషి జీవితంలో ఎన్ని రకాల బంధాలు ఉన్నప్పటికీ తండ్రి కూతుర్ల బంధం మాత్రం ఎంతో ప్రత్యేకమైనది అని చెబుతూ ఉంటారు అందరూ. ఎందుకంటే ప్రతి తండ్రికి కూడా తన కూతురిని మరో అమ్మ పుట్టింది అని ఎంతో సంతోష పడిపోతూ ఉంటే.. ఇక ప్రతి కూతురు కూడా తన తండ్రిని సూపర్ హీరో అని అనుకుంటూ ఉంటుంది. ఇలా తండ్రీ కూతుర్ల మధ్య ఉండే ఆప్యాయత ప్రేమానురాగాలను చూసినప్పుడు ముచ్చటేస్తూ ఉంటుంది అని చెప్పాలి.


 కూతురిని కంటికి రెప్పలా కాచుకునే తండ్రి.. ఇక కూతురికి ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు అన్నది మాత్రం ఇప్పటివరకు ఎన్నో ఘటనల ద్వారా నిరూపితం అయింది అని చెప్పాలి. ఇక ఇక్కడ జరిగిన ఘటన కూడా మరోసారి తండ్రి కూతుర్ల మధ్య ఉండే ప్రేమ అనుబంధానికి నిదర్శనంగా మారింది అని చెప్పాలి. ఏకంగా తన కూతురి కోసం లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు ఆ తండ్రి. ఇక విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో ఎంతోమంది ఆశ్చర్యపోతూ ఉన్నారు అని చెప్పాలి.


ఇంతకీ ఏం జరిగిందంటే.. ఢిల్లీకి చెందిన అంకిత్ అనే వ్యక్తికి కొద్ది రోజుల క్రితమే కూతురు పుట్టింది. దీంతో అతను ఎంతో సంతోషం లో మునిగిపోయాడు . ఈ క్రమంలోనే కూతురితో సమయం గడిపేందుకు తనకు లీవ్ కావాలి అంటూ కంపెనీ మేనేజర్ ను అడిగాడు. అయితే సదరు కంపెనీ మాత్రం అతనికి వారం రోజులు మాత్రమే సెలవులు ఇచ్చింది. దీంతో అంకిత్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన కూతురితో ఎక్కువ రోజులు గడిపేందుకు దాదాపు నెలకు లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపగా కూతురు కోసం తండ్రి ఏమైనా చేస్తాడు అందుకు ఈ ఘటనే  నిదర్శనం అంటూ నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: