అతిచేస్తే గతిచెడుతుందనే సామెత ఒకటుంది. అలాగే మూర్ఖంగా వెళ్ళి గోడకు గుద్దుకుంటే మాడు పగులుతుందనేది పెద్దలు చెప్పేమాట. ఈ రెండు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బాగా సరిపోతుంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఇప్పటం గ్రామంలో ఇళ్ళ కూల్చివేత వివాదం అందరికీ తెలిసిందే. ఈ వివాదంలో తాజాగా హైకోర్టు పిటీషనర్లకు భారీ జరిమానా విధించింది. ఎందుకంటే కోర్టును తప్పుదోవ పట్టించినందుకు. నిర్మాణాల కూల్చివేతపై ప్రభుత్వం నుండి నోటీసులు వచ్చినా తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇళ్ళని కూల్చేస్తున్నారని కోర్టుకే అబద్ధం చెప్పినందుకు.





ఆక్రమణల తొలగింపుపై ఇళ్ళ యజమానులకు ప్రభుత్వం నోటీసులిచ్చిన విషయాన్ని కొందరు జనాలు దాచిపెట్టారు. దాన్ని పవన్ తో పాటు కోర్టు కూడా నమ్మేసింది. సరే ఈ విషయం కేసు విచారణలో బయటపడటంతోనే అందరికీ తలా లక్షరూపాయల జరిమానా వేసింది. తను చేయాల్సిన పనికోర్టు చేసింది. మరి పవన్ పరిస్ధితి ఏమిటి ? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటేనే ఒంటకి కారం రాసుకున్నట్లుగా పవన్ ఊగిపోతుంటారు. సంబంధంలేని విషయాల్లో కూడా జగన్ ప్రభుత్వాన్ని లాగేసి బురద పూసేస్తున్న విషయం ఇప్పటికే బయటపడింది.





ఇపుడు ఇప్పటంలో నిర్మాణాల కూల్చివేత విషయంలో కూడా ఇదే జరిగింది. ప్రభుత్వం తప్పుచేస్తే నిలదీయాల్సిందే. ఇందులో రెండో ఆలోచనే లేదు. కానీ ప్రభుత్వం ఏమిచేసినా తప్పే అన్న మూర్ఖంత్వంతో, మొండితనంతో వ్యవహరించటం నూరుశాతం తప్పే.





ఇపుడు పవన్ చేసిందిదే. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేయటం తప్పని జనాలకు చెప్పాల్సిన పవన్ గ్రామస్తులకు మద్దతుగా నిలిచారు. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జనాల్లో సింపతీ వస్తుందని అనుకున్నట్లున్నారు. ఎలక్షన్స్ దగ్గరపడుతున్నాయి కదా ఇలాంటి ఓవర్ యాక్షన్ ఇంకా చాలాచేస్తారు. ఈ ఓవర్ యాక్షన్ చేసిన ఫలితమే ఇపుడు పవన్ కు మాడు పగిలిపోయింది. జనాలు నిజం చెబుతున్నారా లేదా అని చూసుకునుంటే ఇపుడీ పరిస్ధితి ఎదురయ్యేదే కాదు. ప్రతి విషయంలోను జగన్ను గుడ్డిగా వ్యతిరేకించాలన్న ఏకైక లక్ష్యం పెట్టుకున్న కారణంగానే పవన్ మాడుపగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: