ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో ఫలితం కోసం ఎదురుచూసిన అతి తక్కువ నియోజకవర్గాలలో నెల్లూరు సిటీ కూడా ఒకటి. ఎందుకంటే ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కన్నా కూడా టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన నారాయణ విద్యాసంస్థల అధినేత పి నారాయణ అన్ని రకాలుగా బలంగా ఉండడమే కారణం.. అయితే ఆ సమయంలో రాష్ట్రము అంతటా జగన్ గాలి బాగా వీచింది. అందుకే టీడీపీకి అడ్డాగా ఉన్న చాలా చోట్ల వైసీపీ విజయ కేతనాన్ని ఎగురవేసింది. నెల్లూరు సిటీని వైసీపీ కేవలం 2000 ఓట్ల తేడాతో గెలుచుకుని ఊపిరి పీల్చుకుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఎమ్మెల్యే సీటును గెలుచుకున్న అనిల్ కు ఒక్కసారిగా మైలేజ్ పెరిగిపోయింది.

దీనితో జగన్ అనిల్ కుమార్ పై ఎంతో నమ్మకంతో నీటిపారుదల శాఖకు మంత్రిని చేశాడు. అయితే తన పదవీకాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన అనిల్ కుమార్ యాదవ్ రెండవసారి జరిగిన మంత్రివర్గ కూర్పులో తన మంత్రి పదవిని కోల్పోయాడు. తాజాగా ప్రాంతీయ సమన్వయకర్తగా బాధ్యతల నుండి తొలగించడంతో ఒక్కసారిగా అనిల్ కుమార్ యాదవ్ కు కష్టకాలం ప్రారంభమైందా అన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్క అనిల్ నే కాదు జగన్ చాలా మంది కీలక నేతల విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకుని షాక్ ఇచ్చారు.

 ఇప్పుడు రాజకీయ వర్గాలు నుండి వినిపిస్తున్న గుసగుసల ప్రకారం జగన్ అనిల్ ను ప్రాంతీయ సమన్వయ కర్తగా ఆమోదించనప్పుడు, రానున్న ఎన్నికలలో నెల్లూరు లాంటి ప్రధానమైన నియోజకవర్గాన్ని అప్పగిస్తారా అని తెలుస్తోంది. ఇక నెల్లూరు సిటీ వైసీపీలనే అంతర్గత కలహాలు ఉన్నాయి. ఇలా కొన్ని కారణాలను పరిగణలోకి తీసుకుని వచ్చే ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ కు నెల్లూరు సిటీ కేటాయించే అవకాశం చాలా తక్కువ అని చెప్పాలి. ఇక కొన్ని వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం టీటీడీ బోర్డు లో మెంబెర్ గా ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఈ సీటును కేటాయిస్తారని వినికిడి. మరి ఎన్నికల సమయానికి పరిణామాలు ఏ విధంగా మారుతాయన్నది తెలియాల్సి ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: