కొత్తగా ఏదైనా బైకు కొనాలని అనుకోనేవారికి షాకింగ్ న్యూస్.. బండి కొనాలని అనుకోనేవాల్లు కాస్త ఆగండి..ఈ వార్త మీకోసమే.. దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కీలక ప్రకటన చేసింది. ద్విచక్ర వాహానాల ను కొనెవారికి ఝలక్ ఇచ్చింది. గతం లో ఉన్న ధరకు రెట్టింపు ధరల ను పెంచినట్లు తెలుస్తుంది.. పెరిగిన ద్రవ్యొల్బనం ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.



తమ సంస్థ బైక్‌లు, స్కూటీల ధరల ను పెంచుతున్నట్లు వెల్లడించింది. ఒక్కో వాహనం పై రూ. 1500 వరకు పెంచుతున్నామ ని.. మోడల్, విక్రయించే ప్రాంతాన్ని బట్టి ధర పెంపు పెరగొచ్చున ని స్పష్టం చేసింది. కొత్త ధరలు వచ్చే నెల అంటే డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఉత్పత్తి, ద్రవ్యోల్బణ వ్యయాల కారణం గా మోటర్ సైకిళ్లు, స్కూటర్ల ధరల ను సవరించాల్సిన అవసరం ఏర్పడిందని కంపెనీ పేర్కొంది.



మరోవైపు కస్టమర్ల పై అధిక భారం పడకుండా ఉండేందుకు సంస్థ వినూత్న ఫైనాన్సింగ్ పరిష్కారాల ను అందించడాన్ని కొనసాగిస్తుందని హీరో మోటోకార్ప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా తెలిపారు. కాగా, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం లో హీరో మోటోకార్ప్.. ద్విచక్ర వాహనాల ధరలను పెంచడం ఇది నాలుగోసారి. హీరో మోటోకార్ప్ చివరి సారిగా సెప్టెంబర్‌ లో ఎక్స్-షోరూమ్ వాహనాల ధరల ను రూ. 1000 వరకు పెంచిన విషయం విదితమే. ఈ పెంపు తో టీవీఎస్, బజాజ్ ఆటో వంటి ఇతర ప్రముఖ ఓఈఎంలు సైతం తమ ద్విచక్ర వాహనాల ధరలను పెంచే అవకాశం ఉందని బిజినెస్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాహనాల రేటు పెరిగింది. మరోవైపు పెట్రోల్, డీజేల్ ధరలు కూడా భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.. సామాన్యలకు మాత్రం ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: