మామూలుగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలకు అర్ధముండదు. సమయం, సందర్భం లేకుండా వేదికమీద ఊరికే పూనకం వచ్చినవాడిలాగ ఊగిపోతుంటారు. పార్టీ ఆఫీసులో ఇప్పటం గ్రామంలో ఇళ్ళు కోల్పోయారనే పేరుతో కొందరికీ తలా లక్ష రూపాయల పరిహారం అందించారు పవన్. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, నేతలను శాపనార్ధాలు పెట్టేశారు. అసలు 2024 ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తానంటు చాలెంజ్ చేశారు. జగన్ కతేందో ఇక్కడే తేల్చేస్తానన్నారు.




జగన్ పేరంటేనే పవన్ ఊరికే ఊగిపోతుంటారు. అవసరం లేకపోయినా బల్లగుద్దేసి, గట్టిగట్టిగా అరిచేసి, శాపనార్ధాలు పెట్టేసి, జనాలకు అర్ధంకాకుండా అరచేయటమే పవన్ స్టైల్. ఇపుడు కూడా అలాగే చేశారు. ఎవరిమీద ఫ్రస్ట్రేషనో జగన్ మీద చూపుతున్నట్లే అనుమానంగా ఉంది. లేకపోతే ఇప్పటంలో గడపలు కూల్చేసినందుకు వైసీపీ గడపలు కూల్చేస్తానంటు వార్నింగ్ ఇవ్వటం ఏమిటో అర్ధంకావటంలేదు. ఇప్పటంలో కూల్చేసింది ఇళ్ళుకాదు రోడ్డును ఆక్రమించి చేసుకున్న నిర్మాణాలను మాత్రమే. అదికూడా ముందుగా నోటీసులిచ్చి మరీ కూల్చింది ప్రభుత్వం.





తమకు నోటీసులిచ్చినట్లు, తమ గ్రామంలో ఎవరి ఇంటిని ప్రభుత్వం కూల్చలేదని గ్రామస్తులే చెబుతున్నారు. నోటీసులిచ్చినా ఇవ్వలేదని అబద్ధం చెప్పి కోర్టును తప్పుదోవ పట్టించిన 14 మందికి కోర్టు  తలా రు. 1 లక్ష జరిమానా విధించింది. దీంతోనే తప్పంతా గ్రామస్తులదే కానీ ప్రభుత్వంది కాదని తేలిపోయింది. అయినా పదేపదే జగన్ ప్రభుత్వం పేదల ఇళ్ళని కూల్చేసిందంటు నానా గోలచేశారు.





జగన్ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టాలంటే నరేంద్రమోడీకి చెప్పాల్సిన అవసరమే లేదన్నారు. తానొక్కడే సరిపోతానన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో తనను చూసే తనకుమాత్రమే ఓట్లేయాలన్నారు. వైసీపీని ఓడించటానికి బీజేపీతో అవసరమే లేదన్నారు. మరీమాటలకు అర్ధమేంటో పవనే చెప్పాలి. 2024లో వైసీపీ ఎలాగెలుస్తుందో చూస్తాను అన్నమాట 2019 ఎన్నికల్లో కూడా చెప్పారు. కానీ జరిగిందేమిటో అందరు చూసిందే. ఇక్కడ సమస్య ఏమిటంటే తనను తాను చాలా ఎక్కువ అంచనా వేసుకోవటం జగన్ను చాలా తక్కువగా చూడటమే. వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ను ఏమీచేయలేననే ఫీడ్ బ్యాక్ వచ్చినట్లుంది అందుకనే పవన్లో  ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: