దేశంలో ప్రైవేట్ టెలికాం కంపెనీ లలో అతి పెద్దకంపెనీ రిలయన్స్ ఎప్పటికప్పుడు యూజర్ల కోసం కొత్త కొత్త ప్లాన్స్ ను అందుబాటులో కి తీసుకుని వస్తుంది. కాలింగ్ కోసం సరికొత్త ప్లాను లను తీసుకు వచ్చింది.. వాటికి ఆదరణ కూడా బాగా పెరిగింది.. కొత్త కొత్త ప్లాను లతో పాటు, మరెన్నో సేవలను జియో అందిస్తుంది.. కాగా, ఇప్పుడు యూజర్లకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది. షార్ట్ వీడియోస్ కోసం ఈ యాప్‌ను రూపొందించింది. ఇన్‌స్టా గ్రామ్ రీల్స్ తరహాలో నే ఈ యాప్ కూడా యూజర్ల కు అందుబాటులో ఉంది.


అయితే ఈ యాప్‌ ప్రారంభం లో మొదట వంద మందికి మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. ఆ తర్వాత ఇన్విటేషన్ రూపంలో ఇతరుల కు ఆహ్వానం పంపిస్తారు. వినోదాన్ని అందించే స్టార్స్‌ కు వినోదాన్ని అందించే స్టార్స్‌కు ఇదొక అంతిమ గమ్యం అవుతుంది. గాయకులు, సంగీత కారులు, నటులు, హాస్య నటులు, డ్యాన్సర్లు, ఫ్యాషన్ డిజైనర్లు, సంస్కృతిని ప్రభావితం చేసే సృష్టికర్తలు అందరికీ ఇది గమ్యస్థానం అని జియో ఫ్లాట్‌ఫామ్స్ ఓ ప్రటన లో తెలిపింది..


రిలయన్స్‌ జియో తీసుకువచ్చిన ఈ కొత్త యాప్‌ లో షార్ట్‌ వీడియోలు అప్‌లోడ్‌, డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు. ఈ షార్ట్ వీడియో యాప్ బీటా వెర్షన్‌ లో వచ్చింది. పూర్తి స్థాయి వెర్షన్ 2023 జనవరి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అపుడు యూజర్లు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. అయితే ప్రస్తుం అందుబాటులో కి వచ్చిన ఈ యాప్‌ అందరికి అవకాశం ఉండదు. తర్వాత వెర్షన్‌ లో అందరికి అందుబాటులో కి తీసుకువచ్చే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయి.. ఈ యాప్ అందుబాటులోకి వస్తే ఎంతో మంది టాలెంట్ బయట పడుతుంది.. ఇలాంటి కళలు ఉన్నవారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: