రైతుల అభివృద్ధి కోసం ప్రధాని మంత్రి పీఎం కిసాన్ సమ్మన్ యోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ఈ పథకం ద్వారా 6 వేలు డబ్బులు వస్తాయి.. ఏడాదికి 2 వేలు చొప్పున  మూడు సార్లు అకౌంట్ లో పడుతుంది..ఈ పథకం కింద మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు 12 విడతలు 2000 రైతుల ఖాతాలకు పంపింది.ఇప్పుడు రైతులు తదుపరి 13వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. పీఎం కిసాన్‌ స్కీమ్‌ కింద రైతులు ఏడాదికి రూ.6000 అందుకుంటారు.


ఈ డబ్బులు మూడు విడతల్లో రూ.2000 చొప్పున మోడీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. కానీ ఇప్పుడు ఈ పథకంలో చాలా పెద్ద మార్పులు చేసింది కేంద్రం. అవేంటో తెలుసుకుందాం..పీఎం కిసాన్ యోజన ప్రారంభంలో 2 హెక్టార్లు లేదా 5 ఎకరాల సాగు భూమి ఉన్న రైతులను మాత్రమే అర్హులుగా పరిగణించారు. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఈ నిబంధనను రద్దు చేసింది. తద్వారా దేశంలోని 14.5 కోట్ల మంది రైతులు దాని ప్రయోజనం పొందనున్నారు..పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రయోజనం ఆధార్ కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఇవ్వబడుతుంది. ప్రభుత్వం లబ్ధిదారులకు ఆధార్‌ కార్డును తప్పనిసరి చేసింది.


ఇప్పుడు రైతులు ఇంట్లో కూర్చొని తమ సొంత రిజిస్ట్రేషన్‌ను సులభంగా చేసుకోవచ్చు. మీకు ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ ఉంటే, మీరు pmkisan.nic.in లో రైతుల కార్నర్‌కు వెళ్లి నమోదు చేసుకోవచ్చు. అలాగే ఏదైనా పొరపాటు ఉంటే కూడా మీరే సరిదిద్దుకోవచ్చు..అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేవైసీ) కూడా ఈ పథకం కింద జోడించబడింది. అంటే ఇప్పుడు పీఎం కిసాన్ లబ్ధిదారులు కిసాన్‌ క్రెడిట్‌ కార్డును సులభంగా పొందవచ్చు. ఇది మాత్రమే కాదు, రైతులు కూడా కేసీసీ పై 4 శాతం రూ. 3 లక్షల వరకు రుణాలు పొందుతారు..


పీఎం కిసాన్ మన్‌ధన్‌ యోజన కోసం ఎలాంటి పత్రాలను అందించాల్సిన అవసరం లేదు. ఈ పథకం కింద రైతులు పీఎం కిసాన్ పథకం నుండి పొందిన ప్రయోజనాల నుండి నేరుగా పెన్షన్‌ సదుపాయాన్ని ఎంచుకోవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా ప్రయోజనాలు కల్పించేందుకు ప్రయత్నిస్తోంది..ఇకపొతే వారి దరఖాస్తులో రేషన్ కార్డు వివరాలను నమోదు చేసే రైతులు మాత్రమే ఈ పథకం ప్రయోజనాన్ని పొందుతారు.పీఎంకిసాన్ యోజన కింద కేవైసీ చేయడం తప్పనిసరి. మీరు ఇంకా కేవైసీ చేయకుంటే వెంటనే పూర్తి చేయండి. లేకపోతే మీరు తర్వాత వాయిదాను పొందడంలో ఇబ్బందిని ఎదుర్కొవచ్చు.. డిసెంబర్ 15 నుంచి 21 లోపు 13 వ విడత డబ్బులు కూడా పడనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: