మీజిల్స్  కేసులు బాగా పెరిగిపోతున్నాయి. ఈ కేసులతో ప్రపంచం అంతా వణుకుతుంది.ఈ కరోనా మహమ్మారి తర్వాత మరో వ్యాధి చాలా భయాందోళనకు గురి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల్లో మీజిల్స్‌ కేసులు అనేవి చాలా భారీగా పెరుగుతున్నాయి.ముంబైలో తాజాగా మీజిల్స్‌ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకీ చాలా విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఒక్కసారిగా భయాందోళనలు అనేవి మొదలయ్యాయి. ఇదిలా ఉంటే మీజిల్స్‌ కేసులు మరింత పెరిగే అవకాశం కూడా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ బాగా హెచ్చరిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే చాలా మంది చిన్నారులు కూడా తమ ప్రాణాలు కోల్పోయారు.ఇక మీజిల్స్ వ్యాధి ఇంతలా వ్యాప్తి చెందడానికి కరోనా మహమ్మారి కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో మీజిల్స్‌ వ్యాక్సినేషన్‌ అనేది చాలా భారీగా తగ్గింది. దీంతో కోట్లాది మంది నవజాత శిశువుల్లో మీజిల్స్‌ వ్యాది బాగా వ్యాప్తి చెందుతోంది. 


తాజా నివేదికలో తేలిన అంశాల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే 2021లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 మిలియన్ల మంది చిన్నారులు మీజిల్స్‌ టీకాకు దూరమవ్వడం జరిగింది.ఇదిలా ఉంటే 2021లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 9 మిలియన్ల కొత్త మీజిల్స్‌ కేసులు అనేవి నమోదయ్యాయి.అందులో మొత్తం 1.28 లక్షల మంది మరణించారు.వీటిలో 95 శాతానికి పైగా మరణాలు ఆఫ్రికా ఇంకా అలాగే ఆసియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంభవించాయి. ప్రపంచంలోని దాదాపు 22 దేశాల్లో మీజిల్స్‌ అనేది దారుణంగా వ్యాపించింది. ఇక మీజిల్స్‌ వ్యాధిని అడ్డుకోవడానికి ఇక టీకా ఒక్కటే మార్గం.ఇంకా ఈ వ్యాధికి నిర్ధిష్టమైన చికిత్స అనేది లేపప్పటికీ టీకాలు 97 శాతం ప్రభావితంగా పనిచేస్తాయి. ఈ వ్యాధిని నివారించడానికి పిల్లలకు రెండు డోసుల్లో టీకాని ఇస్తారు.కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా వుండండి. ఈ లక్షణాలు బయటపడితే ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: