క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరికి ఇదే అనుమానం పెరిగిపోతోంది. తెలంగాణా రాజకీయాల్లో వైఎస్సార్టీపీ ద్వారా షర్మిల తన ఉనికిని చాటుకోవటానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఆమె ఎంత ప్రయత్నిస్తున్నా ఎవరు పట్టించుకోవటంలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేసింది, ఆందోళనలు చేసింది చివరకు వారానికి ఒకరోజు నిరాహార దీక్ష కూడా చేసింది. అయినా తెలంగాణా జనాలు పెద్దగా పట్టించుకోలేదు. జనాలు జట్టించుకోవటం కాదు చివరకు తెలంగాణాలోని రాజకీయపార్టీలు కూడా షర్మిలను గుర్తించటంలేదు.





ఈ నేపధ్యంలోనే పాదయాత్ర మొదలుపెట్టింది. అయినా అనుకున్నంతగా గుర్తింపురాలేదు. దాంతో చేసేదిలేక చివరకు వ్యక్తిగత విమర్శలకు, ఆరోపణలకు దిగింది. పాదయాత్రలో ఏ నియోజకవర్గంలో పర్యటిస్తుంటే అక్కడి మంత్రో లేకపోతే ఎంఎల్ఏలపై ఆరోపణలతో విరుచుకుపడటం మొదలుపెట్టారు. తమపైన షర్మిల ఆరోపణలు, విమర్శలు చేసినపుడు మరి వాళ్ళు కూడా ఆమెను ఏదోకటి అంటారు కదా. అలాగ కొంచెం షర్మిలకు గుర్తింపొచ్చింది.





వచ్చిన గుర్తింపు సరిపోలేదనుకుని ఏకంగా అసెంబ్లీ స్పీకర్ మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నది. ఇదికూడా సరిపోలేదనుకుని కొద్దిరోజులుగా డైరెక్టుగా కేసీయార్ పైనే బాణాలు ఎక్కుపెట్టింది. వరంగల్ జిల్లా నర్సంపేట పాదయాత్రలో భాగంగా లోకల్ ఎంఎల్ఏని నోటికొచ్చినట్లు మాట్లాడారు. దాంతో గొడవై ఆమె ప్రయాణించే కార్వాన్ను తగలబెట్టారు. అదికాస్త పెద్ద గొడవై చివరకు షర్మిల అరెస్టుకు దారితీసింది. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చటం కోసం అధికారపార్టీయే షర్మిలను ప్రోత్సహిస్తున్నదా అనే అనుమానం పెరిగిపోతోంది.





షర్మిల గెలుస్తుందో లేదో, షర్మిల పార్టీకి ఎన్ని ఓట్లొస్తాయనేది వేరేసంగతి. ప్రతి వంద ఓట్లలో ఓ నాలుగు ఓట్లు చీలిస్తే చాలన్నట్లుగా ఉంది కేసీయార్ వ్యవహారం. రేపటి ఎన్నికల్లో దాదాపు అన్నీ నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీనే జరుగుతుంది. టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీ మధ్య గట్టిపోటీనే ఉంటుందనుకుంటున్నారు. ఇవికాకుండా చిన్నా చితకా పార్టీలు కూడా తలా ఓ పదిఓట్లు చీలిస్తే చాలు మళ్ళీ టీఆర్ఎస్సే అధికారంలోకి వచ్చే అవకాశముంది. ఇదేకదా కేసీయార్ కు కావాల్సింది. అందుకనే తనను షర్మిల ఎంతగా ఎటాక్ చేస్తున్నా కేసీయార్ పల్లెత్తుమాట అనకపోవటంతోనే అందరికీ సందేహాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: