ఉద్యోగం చేసేవారికి ప్రతి నెలా బేసిక్ సాలరీ నుంచి 12 శాతాన్ని కట్ చేస్తారు. పీఎఫ్‌ ఖాతాకు కంట్రిబ్యూషన్‌గా చెల్లిస్తారనే విషయం తెలిసిందే. ఉద్యోగి పనిచేసే సంస్థ కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తుంటారు.. అయితే కొన్ని కంపెనీలు రెండింటినీ ఉద్యోగుల జీతాల నుంచి చెల్లిస్తుంటాయి. ఇదిలా ఉంటే పీఎఫ్‌ ఖాతా లో ఎంత బ్యాలెన్స్‌ ఉందన్న విషయం తెలుసుకోవాలను అందరూ కోరుకుంటారు. అత్యవసారికి పీఎఫ్‌ అమౌంట్‌ తీసుకోవడం లేదా ఉన్న అమౌంట్‌పై లోన్‌ తీసుకోవాలనే ప్లాన్‌లో ఉంటారు..



అయితే పీఎఫ్‌ అకౌంట్‌ లో ఎంత బ్యాలెన్స్‌ ఉందన్న విషయాన్ని తెలుసుకోవడానికి పలు మార్గాలు ఉన్నాయన్న విషం తెలిసిందే. ఈపీఎఫ్‌ఓ అధికారిక వెబ్‌సైట్‌ లోకి వెళ్లి అకౌంట్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవడం సమయంతో కూడుకున్న పని. అయితే ఒక చిన్న మిస్డ్‌ కాల్‌ లేదా ఎస్‌ఎమ్‌ఎస్‌ సహాయం తో మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఎంతుందో తెలుసుకోవచ్చని మీకు తెలుసా.. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం...


*. ఇందుకోసం ముందుగా మీ మొబైల్‌ నెంబర్‌ మీ యూనివర్సిల్‌ అకౌంట్‌ నెంబర్‌ (UAN)కు లింక్‌ చేసి ఉండాలి. అంతేకాకుండా UAN ఆధార్‌, పాన్‌, బ్యాంక్‌ ఖాతాకు కచ్చితంగా లింక్‌ అయి ఉండాలి.

*.తర్వాత మీ మొబైల్‌ నుంచి ‘EPFOHO UAN ENG’ అని టైప్‌ చేసి 7738299899 నెంబర్‌కు మెసేజ్‌ చేయాలి. పైన తెలిపిన మెసేజ్‌లో చివరి మూడు లెటర్స్‌ మీ స్థానిక భాషను సూచిస్తుంది.

*. అలా వెంటనే మీ పీఎఫ్‌ ఖాతా లో ఎంత బ్యాలెన్స్‌ ఉందన్న సమాచారం మొబైల్‌ కు మెసేజ్‌ రూపంలో వస్తుంది..
ఇక మిస్డ్‌ కాల్ ద్వారా ఎలాగంటే..మీ UAN రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి 01122901406 నెంబర్‌కు మిస్‌ కాల్ ఇవ్వాలి.అలా వెంటనే మీ ఫోన్‌కు మెసేజ్‌ రూపంలో మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ వస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: