కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కు ప్రభుత్వం వరుస గుడ్  న్యూస్ లను అందిస్తూ వస్తుంది.. ఇప్పటికే జీతాల ను పెంచిన ప్రభుత్వం ఇప్పుడు మరో తీపి కబురును చెప్పింది. డీఏను కేంద్రం పెంచిన విషయం తెలిసిందే. తాజాగా ట్రావెల్ అలవెన్స్ ను కూడా పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. నిజానికి డీఏ ను సంవత్సరాని కి రెండు సార్లు కేంద్రం పెంచుతుంది. డీఏ తో పాటే టీఏను కూడా కేంద్రం పెంచుతుంది. తాజాగా ట్రావెలింగ్ డీఏ ను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.


ట్రావెలింగ్ కు సంబంధించిన అలవెన్స్ పెంచింది. దానిలో భాగంగా.. కేంద్ర ఉద్యోగుల కు ఇప్పుడు తేజస్ రైలు, దురంతోలో ప్రయాణించినా, రాజధాని లో ప్రయాణించినా కూడా డీఏ వర్తిస్తుంది. ప్రస్తుతాని క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కు డీఏ 4 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం డీఏ 38 శాతంగా ఉంది. దీంతో టీఏను కూడా పెంచింది కేంద్రం. సాధారణంగా అధికారిక పర్యటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రైలు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఆ పర్యటన లో భాగంగా తేజస్ రైలులో ప్రయాణించవచ్చు..


ప్రైవేట్, ప్రీమియం క్లాస్ లో ప్రయాణించి టీఏను పొందొచ్చు. ట్రావెలింగ్ అలవెన్స్ కింది లేవల్ 1, 2 ఉద్యోగుల కు రూ.1350, లేవల్ 3 నుంచి 8 వరకు రూ.3600, లేవల్ 9 నుంచి పైబడిన వాళ్లకు రూ.7200 డీఏ రానుంది. ఒకవేళ క్యాబినేట్ సెక్రటరీ స్థాయి అధికారుల కు అయితే కారు ఉపయోగించుకుంటే నెలకు రూ.15,750 టీఏ తో పాటు డీఏ ను ప్రభుత్వం చెల్లిస్తుంది. వీళ్లు కారును అధికారిక పర్యటన కోసం కారు లాంటి వాహనాల ను ఉపయోగించుకుంటారు.. మొన్న ప్రైవేట్ ఆసుపత్రి లో బెడ్ ను కూడా అందిస్తూ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.. త్వరలోనే మరో గుడ్ న్యూస్ ను చెప్పనుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: