ఏపీకి భారీ వర్షాలు ముంచెత్తునున్నాయి. బంగాళాఖాతం లో ఏర్పడుతుందనుకుంటున్న వాయుగుండం అంచనా తప్పి బలపడనుంది. తుపాను గా మారి తమిళనా డు, దక్షిణ కోస్తాంధ్ర వైపు పయనించనుంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ పై కూడా పడనుంది. దక్షిణ అండమాన్‌ సముద్రం పరిసరాల్లో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఆగ్నేయ బంగాళా ఖాతం దిశగా పయణిస్తున్న ఈ అల్ప పీడన ద్రోణి సాయంత్రాని కి వాయు గుండంగా మారనుంది.


ఆ తర్వాత అదే దిశలో పయనిస్తూ తుపాను గా బలపడి నైరుతి బంగాళాఖాతం లో కి ప్రవేశించనుంది. ఈ నెల 8న ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి-దక్షిణ కోస్తాంధ్ర సమీపంలో తీరానికి చేరుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది.కాగా ఈ తుపాను కు మాండూస్‌ అనే పేరు పెట్టనున్నారు. ఈ పేరును వాయుగుండం తుపానుగా మారిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఎక్కువగా ఉంటుంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ల్లో ఎక్కువగా ను.. ఉత్తర కోస్తాలో స్వల్పం గాను ఉంటుందని అధికారులు తెలిపారు.


బుధవారం దక్షిణ కోస్తా లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, నెల్లూరు జిల్లా లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. గురువారం దక్షిణ కోస్తా లో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అదే రోజున ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లా ల్లో అక్కడక్క డా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక శుక్రవారం దక్షిణ కోస్తా లో అనేకచోట్ల, ఉత్తర కోస్తా లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లా ల్లో కొన్ని చోట్ల మోస్తారు గా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తం గా ఉండాల ని అధికారులు హెచ్చరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: