ఒకవైపు ఎన్నికల హీట్ పెరిగిపోతోంది. మరోవైపు సామాజికవర్గాల వారీగా సమావేశాలు జరిగిపోతున్నాయి. ఏ సామాజికవర్గం ఏ పార్టీకి మద్దతుగా ఉంటుందో అర్ధంకాక పార్టీల్లో ముఖ్యంగా తెలుగుదేశంపార్టీలో అయోమయం పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో సమాజంలో అత్యధికసంఖ్యలో ఉన్న బీసీల కారణంగా చంద్రబాబునాయుడులో టెన్షన్ పెరిగిపోతోందట. ఎందుకంటే దశాబ్దాలుగా టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్న బీసీల్లో మెజారిటి సెక్షన్లు వైసీపీకి మద్దతుగా మారిపోయాయి.

పార్టీకి బీసీలు దూరమైన ఫలితమే పోయిన ఎన్నికల్లో ఘోర ఓటమి. దూరమైన బీసీలు గనుక మళ్ళీ దగ్గరకు రాకపోతే ఘోరఓటమి మళ్ళీ రిపీటవుతుందేమో అనే టెన్షన్ చంద్రబాబును బాగా పట్టి పీడిస్తోంది. ఇదేసమయంలో దూరమైన బీసీలను ఎలాగ దగ్గరకు తీసుకోవాలో అర్ధంకావటంలేదు. అధికారంలో ఉన్నపుడు నోటికెంతొస్తే అలాగ మాట్లాడి వివిధ సంఘాల నేతలను అవమానించిన విషయం అందరికీ గుర్తుంది. ఇదే సమయంలో బీసీలను జగన్మోహరెడ్డి అక్కున చేర్చుకున్నారు. అందుకనే బీసీలు జగన్ వైపు మొగ్గుచూపించారు.

ప్రతిపక్షంలో ఉన్నపుడే బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే మరింత ఇంపార్టెన్స్ ఇచ్చేశారు. దాంతో బీసీల్లో జగన్ నాయకత్వంపై నమ్మకం పెరిగిపోయింది. ఇదే సమయంలో అధికారంలో ఉన్నపుడు బీసీలను పట్టించుకోని చంద్రబాబు ఇపుడు హామీలిస్తే ఎవరు పట్టించుకుంటారు ? 2014-19 మధ్య రాజ్యసభకు ఒక్క బీసీని కూడా చంద్రబాబు పంపలేదు. అలాగే ఓపెన్ సీట్లలో బీసీలకు టికెట్లిచ్చింది చాలా తక్కువ.

ఇదే సమయంలో ఎంత అవకాశముంటే అంతా జగన్ బీసీలతోనే నింపేస్తున్నారు. బీసీల మద్దతులేకపోతే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపుసాధ్యంకాదు. ఈ నేపధ్యంలోనే బీసీలను ఎలా మళ్ళీ దగ్గరకు తీసుకోవాలో అర్ధంకాక చంద్రబాబు అవస్తలు పడుతున్నారు. బీసీలను ఎలాగైనా వైసీపీకి దూరంచేయాలనే జగన్ పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. బుధవారం విజయవాడలో వైసీపీ ఆధ్వర్యంలో  జరగబోతున్న జయహో బీసీ  సదస్సుపై తమ్ముళ్ళు వ్యతిరేకింగా రెచ్చిపోవటం ఇందులో భాగమే. బీసీల చాంపియన్ తామంటే కాదు తామని వైసీపీ, టీడీపీ నేతలు చెప్పుకోవటం కాదు. తమకు మేలుచేసింది ఎవరనే విషయంలో బీసీలకు స్పష్టమైన అవగాహన ఉండదా ?

మరింత సమాచారం తెలుసుకోండి: