గత ఎన్నికల ప్రభావం ఏపీలో బలమైన పార్టీగా ఇంతకు ముందు వరకు చెప్పుకుంటున్న టీడీపీ పైన బాగా పడిందని చెప్పాలి. 2014 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినా, ఆ తర్వాత ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి, ఓడిపోయి ఇపుడు ప్రతిపక్షములో ఉన్నారు. కానీ చంద్రబాబుకు వయసు మీద పడుతూ ఉండడం కారణంగా ప్రతిపక్షములో ఉండడం నచ్చడం లేదని, అందుకే వచ్చే ఎన్నికల్లో గెలిచి మళ్ళీ అధికార పీఠాన్ని దక్కించుకోవాలని అంది వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వాడుకుంటున్నారు. అందులో భాగంగా గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

ఇంతకు ముందు ఏ నియోజకవర్గాల్లో ఎవరిని పోటీ చేయిస్తే విజయం దక్కుతుందన్న విషయంపైన కూడా సర్వే చేయించుకున్నాడట. సర్వే ప్రకారం... తుని నియోజకవర్గంలో గతం వరకూ కూడా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడిని బరిలోకి దింపుతూ వస్తున్నారు. కానీ టీడీపీ మాత్రం గెలుపును దక్కించుకోలేకపోతోంది. గత రెండు ఎన్నికలలో వైసీపీ తరపు నుండి దాడిశెట్టి రాజా ఎమ్మెల్యే గా గెలిచి ప్రస్తుతం మంత్రిగా ఉంటూ తునిలో అంతకంతకూ తన బలాన్ని పెంచుకుంటున్నాడు. ఇక చంద్రబాబు పదే పదే యనమలను తుని లో పోటీ చేయమని చెబుతున్నా ఆయన ఎమ్మెల్యే గా విజయం సాధించాలన్న విషయాన్ని పక్కన పెట్టి రాజ్యసభకు వెళ్ళడానికి ఆసక్తిని చూపిస్తున్నాడు.

ఇక యనమల కుటుంబంతో రాజకీయ పరంగా పార్టీకి ఏమీ ఉపయోగం ఉందని భావించిన చంద్రబాబు వారిని పూర్తిగా పక్కన పెట్టేయడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇతని స్థానంలో మాజీ ఎమ్మెల్యే మరియు కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలంగా యాక్టీవ్ గా ఉన్న రాజా అశోక్ బాబుకు సీటును కేటాయించడానికి ప్లాన్ చేస్తున్నారట. తునిలో క్షత్రియ సామజిక వర్గం ఎక్కువగా ఉండడంతో క్షత్రియుడనే ఎన్నుకోనున్నారని టాక్.    

మరింత సమాచారం తెలుసుకోండి: