కస్టమర్ల కోసం ప్రభుత్వం, ప్రైవేట్ బ్యాంకులు వరుస గుడ్ న్యూస్ లను అందిస్తున్నారు..ప్రతి నెల బ్యాంకింగ్ లో కొన్ని మార్పులను తీసుకోస్తున్నారు.తాజాగా మరో బ్యాంక్ ఎఫ్‌డీపై వడ్డీ రేట్లను పెంచింది.ఫెడరల్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. రెండు కోట్ల రూపాయల కంటే తక్కువ ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్ల పెంపును ప్రకటించింది.కొత్త రేట్లు డిసెంబర్‌ 18 నుంంచి అమలులోకి వచ్చాయి. ఈ మార్పు తర్వాత బ్యాంక్ ఇప్పుడు సాధారణ ప్రజలకు 3.00% నుండి 6.30%, సీనియర్ సిటిజన్‌లకు 3.50% నుండి 6.95% వరకు FDలపై వడ్డీని చెల్లిస్తోంది. ఇది 7 రోజుల నుండి 2223 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాల వ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై వర్తిస్తుంది..


ప్రస్తుతం ఈ బ్యాంకు 7 రోజుల నుండి 29 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 3.00 శాతం వడ్డీని చెల్లిస్తోంది. అదే సమయంలో 30 నుండి 4 రోజుల వ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై 3.25 శాతం వడ్డీ రేటు ఉంటుంది. అదే సమయంలో 46 రోజుల నుండి 60 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.00 శాతం వడ్డీ రేటు ఉంటుంది. అయితే, 61 రోజుల నుండి 90 రోజుల వరకు ఉండే ఎఫ్‌డీలపై 4.25 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది.


ఫెడరల్ బ్యాంక్ ఇప్పుడు 91 రోజుల నుండి 119 రోజుల మధ్య కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై 4.50 శాతం వడ్డీ రేటును కలిగి ఉంది. కాగా, 120 రోజుల నుంచి 180 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.75 శాతం వడ్డీ లభిస్తుంది. అదే సమయంలో బ్యాంక్ 181 రోజుల నుండి 270 రోజుల వ్యవధితో ఎఫ్‌డీలపై 5.75 శాతం వడ్డీ రేటును కలిగి ఉంటుంది. మరోవైపు, 271 రోజుల నుండి ఒక సంవత్సరం లోపు మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై బ్యాంక్ 6.00 శాతం వడ్డీని అందిస్తుంది..ఇది ఇలా ఉండగా..ఒక సంవత్సరం నుండి 18 నెలల కంటే తక్కువ ఎఫ్‌డీలపై 6.60 శాతం వడ్డీని చెల్లిస్తోంది. 18 నెలల నుంచి 2 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: