తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ప్రాంతాలు ఉన్న గోదారోళ్ల మర్యాదలే వేరులేండి అని ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు. అయితే గోదారోళ్ల మర్యాదలు ఏ రేంజ్ లో ఉంటాయి అన్నది అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక తమ ఇంటికి వచ్చిన వారిని ఇక వద్దు బాబోయ్ చాలు మేము ఇక తినలేం అనేంతలా రకరకాల వంటకాలు చేసి పెట్టి ఇకమర్యాదలతోనే గోదారోళ్లు అతిధులను ఇబ్బందులు పెడుతూ ఉంటారన్నది కూడా అప్పుడప్పుడు సినిమాల్లో ఫన్నీగా చూపిస్తూ ఉంటారు.


 సాధారణంగా సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు ఇక కొత్త అల్లుళ్లు అత్తారింటికి వెళ్లడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇలా అత్తారింటికి వచ్చే కొత్త అల్లుడికి ఎక్కడ ఏమి తక్కువ కాకుండా అన్ని రకాల మర్యాదలు చేస్తూ ఉంటారు అత్తమామలు. ఇక ఆతిథ్యం అనే పదానికి కేరాఫ్ అడ్రస్గా కొనసాగే గోదారోళ్ళు ఇక కొత్త అల్లుడికి ఏ రేంజ్ లో మర్యాదలు చేస్తూ ఉంటారు అన్న విషయం ఇప్పటికే ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.  ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


మర్యాదలకు పుట్టినిల్లుగా చెప్పుకునే భీమవరంలో ఇటీవలే అత్తమామలు కొత్త అల్లుడికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 173 రకాల వంటకాలతో విందు భోజనం వడ్డించారు. దీంతో అత్తమామల మర్యాదతో అల్లుడు ఒక్కసారిగా కంగు తిన్నాడు అని చెప్పాలి. పట్టణానికి చెందిన వ్యాపార వేత్త  బద్రి, సంధ్యా దంపతుల నివాసంలో వారి అల్లుడు చలవ పృద్విగుప్త హారికకు ఇటీవలే వివాహం జరిగింది. ఇక ఈ దంపతులు పండుగ సందర్భంగా అత్తారింటికి వెళ్ళగా 173 వంటకాలతో వారికి విందు భోజనం ఏర్పాటు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ ఆరిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: