: 

అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండుతో అప్పట్లో మొదలైన పాదయాత్ర బండారం ఇపుడు బయటపడింది. ఆ యాత్రంతా ఉత్త బోగస్ అని తేలిపోయింది. పాదయాత్ర పేరుతో చేసిందంతా రాజకీయ యాత్రే అని స్పష్టమైపోయింది. అప్పటి పాదయాత్ర అమరావతి కోసం కానేకాదని కేవలం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందుల పాలు చేసేందుకేననే విషయం ఎల్లోమీడియాలో బయటపడింది. దాదాపు మూడునెలల క్రితం నిలిచిపోయిన పాదయాత్ర మళ్ళీ ఇపుడు జరుగుతోంది.





అయితే అప్పట్లో తండోపతండాలుగా జనాలు ఎంతో కోలాహలంగా మొదలుపెట్టిన పాదయాత్రను ఇపుడు ఒకే ఒక్కడు అమరావతి ఐక్య కార్యాచరణ సమితి (ఐకాసా) కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు మాత్రమే పునఃప్రారంభించారు. ఈయన కూడా ఈనెల 11వ తేదీన యాత్ర మొదలుపెట్టారు. అంటే యాత్ర మొదలుపెట్టిన వారం తర్వాత కానీ విషయం వెలుగులోకి రాలేదు. అమరావతి కోసం ప్రాణాలిస్తామంటు అప్పట్లో నానా రచ్చచేసిన వారిలో అత్యదికులు ఇపుడు అడ్రస్ కూడా కనబడలేదు.





నిజంగానే అమరావతి మీద వాళ్ళకు అంత ప్రేమే ఉంటే మళ్ళీ ఎందుకని పాదయాత్ర మొదలుపెట్టలేదు. గుర్తింపుకార్డులు చూపించి పాదయాత్రను చేసుకోవచ్చని కోర్టు అనుమతించిన తర్వాత కూడా ఎందుకని యాత్రను మొదలుపెట్టలేదు. 11వ తేదీన మొదలైన పాదయాత్రను ఎల్లోమీడియా కూడా ఎందుకని హైలైట్ చేయలేదు ? అప్పట్లో పాదయాత్ర పేరుతో వీరంగాలు వేసిన వందలమంది ఇపుడెందుకు మాయమైపోయారు ? తెలుగుదేశంపార్టీ, జనసేన, వామపక్షాలు ఎందుకు గద్దె పాదయాత్రను పట్టించుకోవటంలేదు ?






ఈ ప్రశ్నలకు సమాధానం ఏమిటంటే అప్పటి పాదయాత్ర బోగస్ అని తేలిపోయింది. అది కేవలం టీడీపీకి మద్దతు సంపాదించటం కోసం మాత్రమే ఏర్పాటుచేసి పాదయాత్ర కాబట్టే. అయితే పాదయాత్ర ద్వారా టీడీపీకి మిగిలిన ప్రాంతాల్లో మైనస్ అవుతోందని అర్ధమవ్వగానే చంద్రబాబు, ఎల్లోమీడియా పాదయాత్రను వదిలేశాయి. చంద్రబాబు పాదయాత్రను పక్కనపెట్టేయగానే పవన్ కల్యాణ్, సీపీఐ రామకృష్ణ కూడా పట్టించుకోవటంలేదు.  హోలు మొత్తంమీద తేలిపోయిందేమంటే అప్పటి అమరావతి పాదయాత్రంతా బోగస్ అని అర్ధమైపోయింది. అందుకనే ఇపుడు గద్దె మాత్రం ఒంటరిగా మిగిలిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: