రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపులో వాలంటీర్ల వ్యవస్ధ కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు తెలుగుదేశంపార్టీ భయపడుతున్నట్లుంది. అందుకనే ఎల్లోమీడియా ద్వారా వాలంటీర్ వ్యవస్ధపై బురదచల్లే కార్యక్రమం పెట్టుకున్నది.  ఒకవైపు జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేసి పోరాడుతున్న టీడీపీ ప్రత్యేకించి వాలంటీర్ల వ్యవస్ధపైన దృష్టిపెట్టాల్సిన అవసరమే లేదు. మొదటినుండి ఈ వ్యవస్ధపై చంద్రబాబునాయుడుతో పాటు తమ్ముళ్ళంతా తీవ్ర వ్యతిరేకత చూపుతున్న విషయం తెలిసిందే.






ఈ వ్యవస్ధపై తాము దుమ్మెత్తిపోయటమే కాకుండా ఎల్లోమీడియాలో ప్రత్యేకంగా కథనాలు రాయించటం కూడా మొదలుపెట్టారు. ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ ను ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమపథకాలు, ఇతర కార్యక్రమాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నదా లేదా అని చూడటానికి, అందకపోతే అందేట్లు చూడటమే వాలంటీర్ల ముఖ్య బాధ్యత. చాలాచోట్ల ఈ వ్యవస్ధపై జనాల్లో సానుకూల స్పందన ఉంది. వాలంటీర్లు చిత్తశుద్దితో పనిచేస్తుండంతో జనాలు కూడా తమ అవసరాలకు వీళ్ళపైనే ఆధారపడుతున్నారు.





లక్షలమంది వాలంటీర్లలో ఎక్కడో కొందరు అడ్వాంటేజ్ తీసుకుని జనాలను ఇబ్బంది పెడుతున్న వారు కూడా ఉన్నారు. అలాంటివాళ్ళపై ఫిర్యాదులు రాగానే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటోంది. రెగ్యులర్ గా తమతో టచ్ లో ఉన్న వాలంటీర్ల ప్రభావం జనాలపైన పాజిటివ్ గా ఉంటుందని, వీళ్ళే జనాలతో వైసీపీకి అనుకూలంగా ఓట్లేయిస్తారనే భయం ఎల్లోబ్యాచ్ లో పెరిగిపోతోంది. అందుకనే ఈ వ్యవస్ధపై ఎల్లోమీడియా  అడ్డదిడ్డమైన రాతలు రాసేస్తోంది.





ఇలాంటి సమాంతర వ్యవస్ధనే చంద్రబాబు జన్మభూమి కమిటీల పేరుతో ఏర్పాటుచేసినపుడు ఎల్లోమీడియాకు  తప్పనిపించలేదు.  ఇళ్ళపట్టాలు, పింఛన్, రేషన్ లాంటవన్నీ జన్మభూమి కమిటీల ద్వారానే చంద్రబాబు పంపిణీ చేయించారు. అప్పట్లో కమిటీల్లోని వారంతా అచ్చంగా టీడీపీ వాళ్ళే ఉండేవారు. కమిటీల్లోని నేతలు, కార్యకర్తల ఓవర్ యాక్షన్ ఎక్కువైపోవటంతో జనాలంతా ప్రభుత్వానికి వ్యతిరేకమైపోయారు. దాంతో టీడీపీ పుట్టిముణిగింది. కానీ ఇపుడు వాలంటీర్లు అలాగ చేయటంలేదు. పైగా జనాల్లో మంచిపేరు సంపాదించుకున్నారు. ఇందుకనే టీడీపీ+ఎల్లోమీడియాలో టెన్షన్ మొదలైనట్లుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: