ఎన్టీయార్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబునాయుడుపై విపరీతమైన ట్రోలింగులు నడుస్తున్నాయి. వర్ధంతి ఎన్టీయార్ ది అయితే ట్రోలింగులు చంద్రబాబుపైన ఎందుకు ? ఎందుకంటే ‘పోటు పొడిచిన వ్యక్తే దండేసి దండం పెడుతున్నాడు’ అని నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగులు చేస్తున్నారు. మామగారిన వెన్నుపోటు పొడిచి చావుకు కారణమైన చంద్రబాబే తర్వాత జయంతి, వర్ధంతి పేరుతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నారంటు జనాలు ఎద్దేవా చేస్తున్నారు.






ఎన్టీయార్ చావుకు కారణమైన వ్యక్తే తర్వాత అదే ఎన్టీయార్ ఫొటోలకు దండలు వేయటమంటే అది చంద్రబాబుకు మాత్రమే సాధ్యమైందని నెటిజన్లు చమత్కరిస్తున్నారు. 1995లో కుటుంబసభ్యుల సాయంతో వెన్నుపోటు పొడిచి ఎన్టీయార్ ను ముఖ్యమంత్రి పదవిలో నుండి చంద్రబాబు దింపేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అధ్యక్షుడిగా తొలగించి పార్టీని కూడా లాగేసుకున్నారు. దీంతో ఎన్టీయార్ అనేక ఇంటర్వ్యూలో చంద్రబాబును అమ్మనాబూతులు తిట్టిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్లో కనబడుతునే ఉన్నాయి.





చివరకు 1996లో తీవ్రమైన మానసికక్షోభతోనే ఎన్టీయార్ మరణించారు. ఆ విషయాలన్నింటినీ నెటిజన్లు ఇపుడు గుర్తుచేస్తు చాకిరేవు పెట్టారు. ఎన్టీయార్ జయంతిని, వర్ధంతిని చంద్రబాబు నిర్వహించటం, ఫొటోలకు దండలువేయటం, ప్రతి సభలోను టీడీపీ వ్యవస్ధాపకుడి ప్రస్తావన చేయటం జరుగుతున్నదే. కానీ ఎందుకనో ఇపుడు మాత్రం నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ఎన్టీయార్ ను చంద్రబాబు ఎంతగా గుర్తుచేసుకుంటున్నారో అంతకుమించి నెటిజన్లు చంద్రబాబుపై ధ్వజమెత్తుతున్నారు. ఎన్టీయార్ హయాంనాటి విషయాలన్నింటినీ గుర్తుచేస్తు చంద్రబాబుకు చాకిరేవు పెట్టారు.






ఎలాగూ రాబోయేది ఎన్నికల సీజనే కాబట్టి ఎన్టీయార్ భజన చేయకుండా చంద్రబాబుకు రోజు గడవదు. ప్రతి బహిరంగసభలోను ఎన్టీయార్ ను బ్రహ్మాండమని, యుగకర్తని, యుగపురుషుడని చంద్రబాబు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.  దాంతో జనాలకు చంద్రబాబుపై బాగా మండిపోతోంది. నిజానికి ఇప్పటిజనాల్లో చాలామందికి ఎన్టీయార్ అంటే జూనియర్ అనే లెక్క. కానీ ఒకతరం ముందువాళ్ళు మాత్రం ఎన్టీయార్ ను మరచిపోలేకున్నారు. బహుశా ఎన్టీయార్ కు సంబంధించి చంద్రబాబుపై నెటిజన్ల ట్రోలింగ్ ముందుముందు మరింత పెరిగిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు.  





మరింత సమాచారం తెలుసుకోండి: