క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం మొదలైంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఈ నెల 28 తేదీన విశాఖపట్నంలోని శారదా పీఠంలో రాజశ్యామల యాగం జరగబోతోంది. యాగంలో పాల్గొనేందుకు జగన్ వైజాగ్ వెళుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా జగన్ ఒకసారి రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చారు. నిజానికి జగన్ కు ఇలాంటి యాగాలపైన పెద్దగా ఆసక్తిలేదనే చెప్పాలి.





ఇదే సమయంలో తెలంగాణా సీఎం కేసీయార్ కు మాత్రం యాగాలు, యజ్ఞాలు, పూజల్లాంటి దైవిక క్రతువులపై విపరీతమైన నమ్మకముంది. తన ఫాం హౌస్లో ఇలాంటి యాగాలు, యజ్ఞాలు చేయిస్తునే ఉంటారు. కేసీయార్ ఇప్పటికి మూడుసార్లు రాజశ్యామల యాగం చేయించిన వి

షయం తెలిసిందే.  ఇందులో ఒకసారి జగన్ కూడా పాల్గొన్నారు. మొదటినుండి జగన్ కు విశాఖ శారధాపీఠాధిపతి స్వరూపానందేద్రస్వామిపైన బాగా గురుంది. స్వామి పీఠంలో చేయించే యాగాల్లో అప్పుడప్పుడు పాల్గొంటునే ఉంటారు.






ప్రత్యక్షంగా జగన్ కు సంబంధంలేకుండా స్వామి ఇదివరకు కూడా రాజశ్యామల యాగం చేయించారు. చివరలో తీర్ధ, ప్రసాదాలు తీసుకోవటానికి మాత్రమే జగన్ వెళ్ళారు. కానీ కేసీయార్ అలాకాదు  యాగం జరిగినన్ని రోజులు పూర్తి దీక్షలో ఉంటారు.  భార్యతో కలిసి యాగ క్రతువులో ప్రతిరోజు  ప్రత్యక్షంగా పాల్గొంటారు. తొందరలో ఎన్నికలు జరగబోతున్నాయి కదా అందుకే రెండురాష్ట్రాల్లోను యాగాలు మొదలవబోతున్నాయి.





అధికారంకోసం, శతృవులపై విజయం కోసం రాజశ్యామల యాగాన్ని చేయిస్తే ఫలితం ఉంటుందని పెద్దలు చెబుతారు. మరి కేసీయార్ కు ఎవరు ఈ యాగాన్ని చేయించమని సలహా ఇచ్చారో కానీ రెగ్యులర్ గా ఫాలోవుతున్నారు. రాజశ్యామల యాగం చేయించమని లేదా పాల్గొనమని జగన్ కు కేసీయార్ లేదా స్వరూపానందేంద్ర స్వామి ఇద్దరిలో ఎవరు సలహా ఇచ్చారో తెలీదు. మొత్తానికి జగన్ కు కూడా ఈ యాగంపై బాగా గురికుదిరినట్లే ఉంది. అందుకనే ఈనెల 28వ తేదీన విశాఖకు వెళుతున్నారు. ఎన్టీయార్ ట్రస్ట్ భవన్లో ఈమధ్యనే జరిగిన చండీ యాగంలో చంద్రబాబునాయుడు కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: