జగన్మోహన్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరిన ప్రత్యేక విమానం 20 నిముషాల తర్వాత హఠాత్తుగా వెనక్కు తిరిగి గన్నవరం చేరుకుంది. 5 గంటల ప్రాంతంలో బయలుదేరి  రెండుగంటల తర్వాత ఢిల్లీకి చేరుకోవాల్సిన విమానం 20 నిముషాల్లోనే తిరిగి ఎందుకు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నదో ముందు అర్ధంకాలేదు. తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తిందట.

విషయం తెలిసిన జగన్ బాగా సీరియస్ అయ్యారు. సాంకేతిక లోపమా లేకపోతే ఉన్నతాధికారులు నిర్లక్ష్యమా అన్న విషయం తేల్చేందుకు విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జగన్ ప్రయాణానికి రెగ్యులర్ గా వచ్చే విమానం కాదట. జగన్ కోసం ఏర్పాటైన విమానం రెగ్యులరా కాదా అన్నది చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రోటోకాల్ ఉన్నతాధికారులదే. కానీ వాళ్ళ బాధ్యతల్లో పూర్తగా ఫెయిలయ్యారని జగన్ మండిపోతున్నారు.


రెగ్యులర్ గా వచ్చే విమానం కాకుండా వేరేది వచ్చినపుడు ఆ విషయం సదరు కంపెనీ నుండి విమానాశ్రయం ఉన్నతాధికారులకు వాళ్ళ ద్వారా సీఎంవో  ఉన్నతాధికారులకు అందాలి. ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నతాధికారులు, భద్రతాధికారులు జగన్ కు చెప్పుండాలి. కానీ పైన చెప్పిందాంట్లో ఏదీ జరగలేదు. అందుకనే జగన్ ఇపుడు మండిపోతున్నారు. పైలెట్ అప్రమత్తంగా ఉండటంతో జగన్ పెద్ద ప్రమాదంలో నుండి తప్పించుకున్నట్లు అర్ధమవుతోంది.


ఒకపుడు వైఎస్సార్ కు కూడా ఇలాగే జరిగింది. 2009 జూన్ 2వ తేదీన వైఎస్సార్ ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదానికి గురవ్వటంతో చనిపోయిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా రెగ్యులర్ గా వచ్చే హెలికాప్టర్ కాకుండా వేరేదొచ్చింది. దాంతో ఏమైందో ఏమో తెలీదుకానీ  హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. సేమ్ టు సేమ్ ఇపుడు కూడా అలాంటి పరిస్ధితే ఎదురయ్యింది. కాకపోతే అప్పట్లో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది ఇపుడు జగన్ తప్పించుకున్నారు. మొత్తానికి జగన్ ప్రమాదంలో నుండి  తృటిలో తప్పించుకున్నట్లే లెక్క.


మరింత సమాచారం తెలుసుకోండి: