వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం చక్కటి శుభవార్త చెప్పింది. ఇక చిన్నపాటి నుంచి పెద్ద ఉద్యోగులకు ఊరటనిస్తూ బడ్జెట్లో కీలక ప్రకటన చేయడం జరిగింది.ఇక ఏడు లక్షలు సంపాదించినా కూడా ట్యాక్స్ ఉండదు. పన్ను పరిమితిని పెంచుతూ ఇవాళ మంత్రి నిర్మల ప్రకటన చేయడం జరిగింది. 9 లక్షల నుంచి 15 లక్షల దాకా పన్నును మొత్తం 10 శాతానికి పెంచారు.ఈ విధంగా ఆదాయపు పన్ను పరిమితిని కేంద్రం పెంచింది. పూర్తి వివరాల్లోకి వెళితే..ఆదాయ పన్ను పరిమితి ఏడు లక్షలకు పెంచడం జరిగింది.5 లక్షల నుంచి ఏడు లక్షలకు ఆదాయపన్ను పరిమితిని పెంచుతున్నట్లు మంత్రి నిర్మల గారు తెలిపారు. ఇక నుంచి ఏడు లక్షల ఆదాయం దాకా అసలు ఎటువంటి పన్ను ఉండదని ఆమె వెల్లడించారు. ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి నిర్మల ఈ విషయాన్ని తెలిపారు.రూ.9 లక్షల నుంచి 15 లక్షల ఆదాయానికి 10 శాతం పన్నుని విధించనున్నారు.


ఈ కొత్త పన్ను విధానంలో ఈ రిబేట్‌ను కల్పిస్తున్నట్లు మంత్రి నిర్మలా చెప్పారు. 2020 వ సంవత్సరంలో ఆరు ఇన్‌కం స్లాబ్స్‌లో పన్ను విధానాన్ని ప్రవేశపెట్టామని, ఇక దాంట్లో స్లాబ్లను అయిదుకు తగ్గించామని, ఆదాయాన్ని కూడా మూడు లక్షలకు పెంచినట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.అయితే మొత్తం 15 లక్షల ఆదాయం దాటిన వారికి 30 శాతం పన్ను విధించనున్నారు.ఇక రూ.3 నుంచి 6 లక్షల దాకా ఆదాయం ఉన్న వారు 5శాతం, రూ.6 నుంచి 9 లక్షల దాకా ఆదాయ వున్నవారు 10శాతం,9 నుంచి 12 లక్షల దాకా ఆదాయం ఉంటే 15శాతం, రూ.12 నుంచి 15 లక్షల వరకు ఆదాయం ఉంటే 20 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక రూ.15 లక్షల ఆదాయం దాటిన వారు ఖచ్చితంగా 30శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనని మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.అయితే రూ.3 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు మాత్రం ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇది నిజంగా పేద మధ్య తరగతి ప్రజలకు మంచి శుభవార్త అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: