నిండు అసెంబ్లీలో కేటీయార్ కోరి మరీ మజ్లిస్ పార్టీతో గోక్కున్నారు. కేటీయార్ తీరు చూస్తే తర్వాత  దారినపోయే చెత్తను తీసి నెత్తినేసుకున్నట్లుంది. అసెంబ్లీలో ఎంఐఎం శాననసభా పక్షనేత అక్బరుద్దీన్ మాట్లాడుతున్నపుడు కేటీయార్ జోక్యం చేసుకున్నారు. మాట్లాడేందుకు పార్టీలకు ఇచ్చే సమయంపై కేటీయార్ మాట్లాడుతు ఏడు సీట్లుండే పార్టీకి అంత సమయం ఇస్తే మరి బీఆర్ఎస్ కు ఎంత సమయం ఇవ్వాలని స్పీకర్ ను అడిగారు. కేటీయార్ ప్రశ్నను అక్బర్ చాలా అవమానంగా ఫీలయ్యారు.





వెంటనే సమాధానమిస్తు ఏడుసీట్లపార్టీయే వచ్చేఎన్నికల్లో 50 సీట్లకు పోటీచేయబోతోందని, కనీసం 15 మంది ఎంఎల్ఏలు సభలో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కేటీయార్ అవమానం, అక్బర్ సమాధానం ఇపుడు తెలంగాణాలో హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పటికే మజ్లిస్ పార్టీ విస్తరణ ఆలోచన చేస్తోందన్న విషయం తెలిసిందే. తెలంగాణా వ్యాప్తంగా ముస్లిం జనాభా ఏ నియోజకవర్గాల్లో ఎక్కువుందో లెక్కలు తీస్తోంది. పోటీచేస్తే ఎన్ని నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలున్నాయనే విషయం మీద కూడా సర్వే చేయించుకున్నది.





ఇప్పటివరకు ఎంఐఎం హైదరాబాద్ లోని ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్ధానం దాటి బయటకు వచ్చిందిలేదు. ఇతర స్ధానాల్లో పోటీచేసింది లేదు తన స్ధానాలను వదులుకున్నది లేదు. కాబట్టే ఎంఐఎం అయినా మిగిలిన పార్టీలైనా సేఫ్ గా ఉన్నాయి. అయితే కేటీయార్ వ్యాఖ్యల నేపధ్యంలో ఎంఐఎం గనుక 50 నియోజకవర్గాల్లో పోటీచేస్తే మొదటిదెబ్బ బీఆర్ఎస్ మీదే పడుతుంది.






ఎలాగంటే బీఆర్ఎస్-ఎంఐఎం ఫ్రెండ్ షిప్ కారణంగా బయటనియోజకవర్గాల్లోని ముస్లిం ఓట్లు ఎక్కువగా కారుపార్టీకే పడుతున్నాయి. అలాంటిది వచ్చేఎన్నికల్లో ఎంఐఎం పోటీచేస్తే బీఆర్ఎస్ కు పడుతున్న ఓట్లు ఆగిపోయి మజ్లిస్ కే పడతాయి. పడుతున్న ఓట్లు ఆగిపోతే ఆ ఓట్లన్నీ బీఆర్ఎస్ కు మైనస్సన్నట్లే కదా. టైట్ ఫైట్ జరిగే నియోజకవర్గాల్లో సింగిల్ డిజిట్ ఓటు కూడా గెలుపోటములను నిర్దేశిస్తుంది. అప్పుడు మజ్లిస్ గెలవలేకపోవచ్చు కానీ బీఆర్ఎస్ ఓటమికి కారణమవుతుంది. అదే జరిగితే అప్పుడు బీఆర్ఎస్ పరిస్ధితేంటి ? కేటీయార్ వ్యాఖ్యలను మజ్లిస్ సీరియస్ గా తీసుకుంటే జరగబోయేదిదే. అందుకనే కేటీయార్ అనవరంగా గోక్కున్నారనే చర్చ జరుగుతోంది.  




మరింత సమాచారం తెలుసుకోండి: