ఇక దేశ వ్యాప్తంగా చరిత్ర సృష్టించి గూస్ బంప్స్ తెప్పించి చాలా పెద్ద సంచలనంగా మారిన శ్రద్ధా హత్య కేసులో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఆమెను చంపిన నిందితుడు అఫ్తాబ్ గ్రైండర్‌లో శ్రద్ధా ఎముకలను గ్రైండ్ చేసి, ఆపై ఆ ఎముకల పొడిని పార చేసినట్లు పోలీసులు తేల్చడం జరిగింది.ఇక నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాపై ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను సాకేత్ కోర్టు మంగళవారం నాడు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇంకా అదే విధంగా అఫ్తాబ్‌ తరపు న్యాయవాదికి కూడా కోర్టు ఛార్జ్‌షీట్‌ కాపీని అందించడం జరిగింది.అఫ్తాబ్ తన లైవ్-ఇన్ పార్ట్నర్ శ్రద్ధా వాకర్‌ గొంతు కోసి ఇంకా ఆమె శరీరాన్ని ఛిద్రం చేశాడని పోలీసులు ఛార్జ్ షీట్లో పేర్కొనడం జరిగింది. ఈ చార్జిషీట్‌ను పరిశీలించేందుకు ఫిబ్రవరి 21వ తేదీని కోర్టు తదుపరి తేదీగా నిర్ణయించగా జనవరి 24 వ తేదీన పోలీసులు మొత్తం 6,629 పేజీల చార్జిషీటును దాఖలు చేయడం జరిగింది.


ఇక ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసిన తర్వాత ఆ రంపాన్ని అడవిలో విసిరినట్లు అఫ్తాబ్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపడం జరిగింది. నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా డేటింగ్ యాప్ ద్వారా తనకు పరిచయమైన  చాలా మంది అమ్మాయిలతో కూడా డేటింగ్ చేస్తున్నాడని పోలీసులు ఛార్జ్ షీట్‌లో తెలిపారు.ఆ నిందితుడు ఆమెను చంపిన మూడు నాలుగు నెలల తర్వాత బ్లో టార్చ్‌తో కాల్చి ఆమె ముఖం ఇంకా అలాగే జుట్టును పాడుచేయడానికి ప్రయత్నించాడట.అందువల్ల ఎట్టిపరిస్థితుల్లో కూడా ఆమె గుర్తింపు బయటకు తెలియలేదని అనుకున్నాడు.ఇక అఫ్తాబ్ శ్రద్ధాను సుత్తితో కొట్టి చంపి ఇంకా 3 కత్తులతో ఏకంగా 35 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ పెట్టాడని అలాగే బ్లోటార్చ్ తో ఆమె వేళ్లను కూడా కత్తిరించి ఎముకలను స్టోన్ గ్రైండర్తో పొడి చేసి ఆ పౌండర్ ని అడవిలో చల్లాడని తెలిపాడు. ఇక ఆమెను చంపిన తర్వాత అఫ్తాబ్ జొమాటోలో చికెన్ రోల్స్ కూడా ఆర్డర్ చేసుకొని తిన్నాడని పోలీసులు తేల్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: