సాధరణంగా స్మశానం అనగానే మనకు ఏం గుర్తుకొస్తాయి. ఎక్కడ చూసినా సమాధులు, వాటిలో మధ్యలో పెరిగిన పిచ్చి మొక్కలు, కొంత దూరంలో శవాలను దహనం చేసే గది. పక్కనే శవాన్ని మోసుకొచ్చిన పాడే, తీసేసిన వస్త్రాలు వగేరా కనిపిస్తాయి. ఇవన్నీ తలచుకుంటూ స్మశానికి వెళ్లేందుకు కొంత మంది భయపడతారు. లోనికి అడుగు పెట్టేందుకు కూడా సాహసించరు. అయితే.. బ్రెజిల్ లోని ఓ స్మశానంను చూశారంటే.. అక్కడి  నుండి కదలనే కదలరు. ఏంటి నమ్మబుద్ధి కావడం లేదా..? అయితే ఫైవ్ స్టార్ హోటల్ ను తలదన్నేలా ఉండే 'మెమోరియల్ నెక్రోపోల్ ఎక్యుమెనికా' గురించి చెప్పాల్సిందే...


ఈ ఫైవ్ స్టార్ స్మశానం పేరు మెమోరియల్‌ నెక్రోపోల్‌ ఎక్యుమెనికా. ఇది బ్రెజిల్‌లోని సాంటోస్‌లో ఉంది. 1986లో ఈ స్మశానాన్ని నిర్మించారు. అప్పట్లో చిన్నదిగా ఉన్నా.. మారుతున్న కాలానుగుణంగా  స్థానికులు మార్పులు చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం 108మీటర్ల ఎత్తు, 35 అంతస్తులతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. భవనం అంతటా ప్రకృతి పరవసించేలా.. అరుదైన వృక్ష జాతులతో ఉద్యానవనాలు ఏర్పాటు చేశారు. అందులో ముచ్చటగొలిపే వాటర్ ఫౌంటేన్ లు, జలపాతం, నెమలి పార్క్ లు తీర్చిదిద్దారు. ఇక్కడికి వచ్చేవారి కోసం హోటల్స్, రెస్ట్ తీసుకునేందుకు లగ్జరీ రూమ్ లు,  ప్రార్ధనలు చేసుకునేందుకు పెద్ద చర్చి నిర్మించారు. 

ఈ భవనం ఎదుట పెద్ద చర్చి ఉంది. మృతదేహాలను ఖననం చేసేముందు పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రార్థనలు చేసుకోవచ్చు. 35 అంతస్తులలో 32 ఫోర్లను సమాధుల కోసం వినియోగిస్తున్నారు. ఒక్కో ఫ్లోర్ లో 150 సమాధులుంటాయి. అందులో ఒక్కో దానిలో ఆరు మృతదేహాలు పడతాయి. 25వేల మృతదేహాలను పొందుపరచగలిగే సామర్ధ్యంతో దీనిని నిర్మించారు. ఇక్కడ సమాధి చేసే మృతదేహాలు మూడు సంవత్సరాల పాటు పాడవకుండా ఉండటం విశేషం. ఈ భవనంలో కావాల్సిన అంతస్తుల్లో మృతదేహాల్ని భద్రపరుకునేందుకు 5వేల నుంచి 20వేల డాలర్ల వరకు వసూలు చేస్తారు. అమ్మో అంతా అని ఆశ్చర్య పోకండి.. భూత్ బంగ్లాలను తలపించే మన స్మశానాల్లోనే వేలకు వేలు ఖర్చవుతుంటే.. ఫైవ్ స్టార్ ను తలపించేలా ఉన్న శ్మసానంలో ఆ మాత్రం ఖర్చవదా.. చెప్పండి.



మరింత సమాచారం తెలుసుకోండి: