కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో ఎన్ 7 బోగీలో అర్థరాత్రి ప్రయాణికులు, టీటీ అందరూ గాడనిద్రలో మునిగిపోయారు. ఒక్కసారిగా బోగీలోని మరుగుదొడ్డిలోంచి అరుపులు వినపడడంతో బోగీలోని ప్రయాణీకులు వెళ్లి ఎంత ప్రయత్నించినా తలుపులు తెరుకోకపోవడంతో,  టీటీ రైల్వెపోలీసులకు సమాచారం అందించారు. అమదాలవలస రాగానే స్టేషన్లో రైలు ఆపి తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి మృతిచెందివున్న మహిళ శవం. ఆమెను ధారుణంగా హత్య చేసింది ఆమె భర్త కిషోర్ బెహరా. వీరిద్దరూ విశాఖపట్నం నుంచి గొడవపడుతూనే ఉన్నారని బోగీలోని ప్రయాణీకులు తెలిపారు. ఆమె పేరు లతాప్రకాష్ బెహరా. రైలు విజయనగరం చేరుకున్నప్పుడు ఆమె మరుగుదొడ్డిలోకి వెళ్లిందని ప్రయాణికులు తెలిపారు. ఆ వెనుకాలే భర్త సూట్ కేస్ తగిలించే గొలుసు తీసుకుని వెళ్ళాడని తెలస్తుంది. సంఘటన స్థలంలో లోపలంతా పగిలిపోయిన గాజు పెంకులు రక్తపుమరకలు దాదాపు అరగంటసేపు లోపల పెనుగాలాడినట్లు శబ్దాలు, కేకలు వినిపించాయని ప్రయాణికులు చెప్పారు. ప్రాణాలను రక్షించుకునేందుకు ఆమె శతవిధాలా ప్రయత్నించింది. కానీ, భర్త బలం ముందు ఓడిపోయింది. గొలుసును ఆమె గొంతునులుమేయడంతో ప్రాణాలు కోల్పోయింది. ఆముదాలవలస స్టేషన్లో కిషోర్ బెహరాను అదుపులోకి తీసుకుని పోలీసులు ఎంతగా ప్రయత్నించినా అతను నోరు మెదపలేదు. పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడు. దొరికిన ఆధారాలను బట్టి ఇతను ముంబయిలో డ్రైవరుగా పనిచేస్తున్నాడని రైల్వే పోలీసు తెలిపారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: