కప్పలకు పెళ్లిచేస్తే వరుణదేవుడు కరుణించి వర్షాలు కరిపిస్తాడనే నమ్మకం ఇప్పటికీ కొన్నిచోట్ల ఇంకా కనిపిస్తోంది. వర్షాలు మంచిగా కురిసి రైతులు సంతోషంగా ఉండాలని ఈ పెళ్లి జరిపించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఓ గుడిలో నిర్వహించారు. కప్పల పెళ్లిని చూడటానికి పెద్దఎత్తున ప్రజలు ఆలయం దగ్గరకు వచ్చారు. పెళ్లికి బ్యాండ్ బాజాలు కూడా ఏర్పాటు చేశారు. పెళ్లి తర్వాత వింధుభోజనాలు పెట్టి, పెద్ద పండుగలా ఈ కప్పల పెళ్లి  కార్యక్రమం జరిపించారు. 

ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ లో వానల కోసం కప్పలకు పెళ్లి జరిపించిన మహిళా శిశుసంక్షేమ శాఖ సహాయమంత్రి లలితా యాదవ్‌ పై పోలీసు కేసు నమోదైంది. హర్యానా వన్యప్రాణ హక్కుల సంస్థ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎనిమల్ అండ్ బర్డ్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు జంతుహింస నివారణ చట్టం 1960 సెక్షన్ 3, ఐపీసీ 429,428, 120 బి ప్రకారం లలితా యాదవ్ పై కేసు పెట్టారు. ఈ కేసులో నేరం రుజువైతే మంత్రికి మూడు సంవత్సరాల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 

ప్రకృతి దేవతలను ప్రసన్నం చేసుకోవాలంటే కప్పలకు పెళ్లి చేయడం, విందు భోజనం ఏర్పాటు చేయడం అనాదిగా వస్తున్న ఆచారామని ఆలయ పురోహితుడు ఆచార్య బ్రిజ్ నందన్ ఈ వేడుకను సమర్ధించారు. త్రాగునీటి సరఫరా చేయడం మానేసి ఇలాంటి కప్పల పెళ్లిళ్ల కార్యక్రమాన్ని జరిపించడంలో మంత్రి లలితా యాదవ్ బిజీగా ఉన్నారని చత్తర్ పూర్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ అలోక్ చతుర్వేది తెలిపారు. అయితే మంత్రి లలితా యాదవ్ మాత్రం.... ప్రతీ పనికీ ఒక లాజిక్ ఉంటుందని, పర్యావరణ సమతుల్యం అనే సూత్రం కూడా ఇందులో ఇమిడి ఉందని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: