తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్  ‘జనసేన’అధ్యక్షుడు, నటుడు పవన్ కళ్యాన్ కి వీర అభిమాని అని తెలిసిందే.  అయితే తెలంగాణలో జనసేన బాధ్యతలు బండ్ల గణేష్ తీసుకుంటారని అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ బండ్ల మాత్రం కాంగ్రెస్ కండువ కప్పుకున్నాడు.  రాజకీయాల్లోకి తాను రావడం కొత్తే అయినా..ఇక్కడ రాజకీయలు తనకు బాగా వంట పట్టాయని..తాను పక్కా తెలంగాణ వాదిని అని..తమ కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానులని అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరానని అన్నారు. 

అయితే బండ్ల తన నియోజక వర్గం అయినా షాద్ నగర్ నుంచి టిక్కెట్ ఆశించారు..కానీ మొన్నటి లీస్టు లో షాద్ నగర్ స్థానాన్ని ప్రతాప్ రెడ్డికి కేటాయించారు. ఐతే బండ్ల ఇంకా ఆశతోనే ఉన్నాడంటున్నారు. ఏదో ఒక స్థానాన్ని అతడికి కేటాయించడం ఖాయం అంటున్నారు.  తాజాగా ఓ మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ ప్రభుత్వం పై పంచుల వర్షం కురిపించారు.  కేసీఆర్ పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇల్లే అని చెప్పాడని.. ఐతే తామందరం ఇల్లు ఇస్తారని అనుకున్నామని కానీ.. ఆయన 'ఇల్లే' (తమిళంలో లేదు) అని చెప్పారని లేటుగా అర్థమైందని.. ఆయన తప్పేమీ లేదని బండ్ల అన్నాడు.

ప్రతి నల్లాలో నీళ్లు అని చెప్పి నీళ్లు ‘నిల్' చేశారని ఎద్దేవా చేశాడు బండ్ల. రాష్ట్రంలో వెనుకబడిన తరగుతుల వాళ్లకు మూడు ఎకరాల ఇల్లు ఇస్తామన్నాడని.. అంటే ప్రతి ఒక్కరికీ మూడు ఎకరాలని తామనుకున్నామని.. కానీ రాష్ట్రంలోని అందరికీ కలిపి మూడు ఎకరాలని కేసీఆర్ అన్నాడని తర్వాత అర్థమైందని బండ్ల అన్నాడు. ఇక 'కేజీ టూ పీజీ విషయంలో కేసీఆర్ పడ్డాడు రాజీ.. కాబట్టే జనాలు ఆయన్ని చేయబోతున్నారు మాజీ' అంటూ ప్రాస డైలాగ్ కొట్టాడు బండ్ల.  మొత్తానికి బండ్ల గణేష్ పంచులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: