ఏప్రిల్ 11 న ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. మే 23 న ఎన్నికల పలితాలు ఎలాగూ వస్తాయి. ఎందుకు తెలుగుదేశం పార్టీకి ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? అనే సొద! ఈ సమీక్షలి ఏవైనా శాస్త్రీయమా? అధినేత మెప్పుకోసం చెసే చక్క భజన తప్ప మరేమీ కాదు.  సాధారణంగా ఏ అభ్యర్థైనా అధినేతకు నివేదిక ఇచ్చేటప్పుడు కచ్చితంగా గెలుస్తామనే ఇస్తారు తప్ప ఓడిపోతారని ఇవ్వరు. అలాంటప్పుడు ఆయా అభ్యర్థుల నుంచీ నివేదికలు  తెప్పించుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుందన్నది? మే 23 వచ్చే వరకూ ఇలాంటి కహానీలతో కాలం గడిపి ప్రజలను మభ్యపెడితే ప్రయోజనం ఏముంది. ఈవీఎం లలో నిక్షిప్తమైన ఓట్ల గణన తరవాతే గదా పలితాలు వచ్చేది. అంతవరకు ఎవరేమి చెప్పినా సొల్లు కబుర్లే. 
Image result for mandalagiri lokesh
చంద్రబాబుకి ఇచ్చే నివేదికలు  అత్యంత కచ్చితమైనవి అనీ, క్షేత్రస్థాయిలో పోలింగ్ బూత్‌లు, ఓటర్లు, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల బలాబలాలు, స్థానిక సమీకరణాలు, ప్రచారంలో హోరు, పోలింగ్ జరిగిన తీరు, ఓటర్లు స్పందించిన విధానం, జరిగిన అభివృద్ధి, ప్రభుత్వం కలిగించిన ప్రయోజనాలు ఇలా దాదాపు 50 రకాల అంశాల్ని లెక్కలోకి తీసుకొని, నివేదికలు  తయారు చేశామంటున్నారు. అందువల్ల వంద శాతం కచ్చితత్వంతో రిపోర్టులు ఉంటున్నాయన్నది వారి వాదన. ఈ వాదనను ఎవరైనా నమ్ముతారా? ఎందుకీ ఝంఝాటం.
Image result for alla ramakrishna reddi vs lokesh
లోకేష్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడంతో ఆయన విజయావకాశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. లోకేష్ ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యనివ్వకుండా,  ఎన్నికల్లో బరిలో దింపారు చంద్రబాబు. ఇందుకు ప్రధాన కారణం లోకేష్ గెలుపుపై అధినేతకు నమ్మకం లేనట్లే. అందుకే కనీసం ఎమ్మెల్సీగా కొన సాగించాలనే అవకాశం కోల్పోవద్దనే ఉద్దేశంతోనే ఆయన అలా చేశారని ప్రతిపక్షాలు అంటున్నాయి. లోకేష్ గెలుస్తారనీ, కాకపోతే కొద్దిపాటి మెజార్టీతో గెలుస్తారని ఏప్రిల్ 11న ఎన్నికలు ముగిసిన తర్వాత ఏప్రిల్ 13న చంద్రబాబుకి సన్నిహిత వర్గాలు చెప్పినట్లు తెలిసింది. అప్పటి నుంచీ చంద్రబాబు, లోకేష్ గెలుపుపై ధీమాగా ఉన్నారు. 
Image result for alla ramakrishna reddi vs lokesh
తాజాగా నియోజకవర్గాల వారీగా ఆయా అభ్యర్థుల నుంచీ నివేదికలు తెప్పించుకుంటున్న చంద్రబాబు, మంగళగిరిలో పరిస్థితి ఏంటన్నదానిపై లోకేష్ నుంచీ రిపోర్ట్ తెప్పించుకొని పరిశీలించారు. అందులో లోకేష్‌కి ప్రధాన ప్రత్యర్థి కంటే 30 శాతం ఎక్కువ ఓట్లు వస్తాయని ఉన్నట్లు తెలిసింది. దాంతో చంద్రబాబుతో పాటూ టీడీపీ వర్గాలు ఫుల్ ఖుషీ అయిపోయాయి. కనీసం ఈ పది రోజులైనా లోకెష్ ని ఆ భ్రమలోనైనా బ్రతకనిద్ధాం! ఈ శునకానందం గణకాల కంటే ఈవీఎంలో నిక్షిప్తమైన సమాచారం బయట పడితే ఎవరి బ్రతుకేమిటో తెలుస్తుందని అంటున్నారు విశ్లేషకులు. 
Image result for alla ramakrishna reddi vs lokesh
టీడీపీ లోకెష్ విషయంలో ఇంత పాజిటివ్‌గా ఉన్నా, మంగళగిరిలో లోకేష్ గెలుపు అంత తేలిక కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మంగళగిరిలో 2014 లో వైసీపీ తరపున గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి బరిలో దిగి లోకేష్‌కు గట్టిపోటీ ఇచ్చారు. స్థానికంగా ఆయనకు మంచి పేరుంది. ప్రజలకు ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందిస్తారనే సానుకూల అంశం ప్రభలంగా ఉంది. 

ఐతే అదే మంగళగిరిలో టీడీపీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా ఐటీ సంస్థలకు అక్కడ ప్రత్యేక వెసులుబాట్లు కల్పించింది. అదీ కాక మంగళగిరి, రాజధాని అమరావతి లో భాగంగా ఉంటోంది. దాంతోపాటూ, సీఎం చంద్రబాబు కొడుకైనందున టీడీపీ అధికారంలోకి వస్తే, లోకేష్ వల్ల మంగళగిరి ఎక్కువ అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో తటస్థ ఓటర్లు టీడీపీకి ఓటు వేస్తారని భావించి, ఆ స్థానంలో లోకేష్‌ని దింపారని తెలుస్తోంది. 
Image result for alla ramakrishna reddi vs lokesh
"లోకేష్ అసమర్థుడనీ, దమ్ముంటే ఎమ్మెల్యేగా గెలిచి, అప్పుడు మంత్రి పదవి చేపట్టాలి" అని  వైసీపీ ఎమ్మెల్యే రోజా సవాల్ విసిరారు. ఆ సవాల్‌ని స్వీకరించిన లోకేష్, దేనికైనా తెగించాలనే ఉద్దేశంతోనే మంగళగిరిని ఎంపిక చేసుకున్నారని తెలిసింది. మంగళగిరిలో ప్రచారం విషయంలో టీడీపీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అందువల్ల గెలుపుపై ఆపార్టీ ధీమాగా ఉండటంలో ఆశ్చర్యం అక్కర్లేదు.
Image result for mangalagiri roja vs lokesh
లోకేష్ గెలిచే అవకాశాలు తక్కువేనని బెట్టింగ్ బుకీలు సట్టా బజార్ వాళ్లూ చెబుతున్నారు. అయినప్పటికీ ఆయన గెలిస్తే ఏమవుతుందన్న అంశంపై రాజకీయవర్గాల్లో ఒక ప్రక్క చర్చ జరుగుతోంది. లోకేష్ ఓడిపోతే, తిరిగి ఎమ్మెల్సీగా కొనసాగుతారు. ఇది క్లియర్. ఒకవేళ లోకేష్ గెలిచి, టీడీపీ ఓడిపోతే, ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు తర్వాత లోకేష్ ప్రతిపక్షంలో ప్రధాన నేతగా కొనసాగుతారు. అలాకాకుండా లోకేష్ గెలిచి, టీడీపీ అధికారంలోకి వస్తే, చంద్రబాబు వారసుడిగా భవిష్యత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా లోకేష్ అవతరించే అవకాశాలుంటాయి. 
Image result for alla ramakrishna reddi vs lokesh
అలాంటి పరిస్థితే వస్తే, మంగళగిరి అభివృద్ధిపై లోకేష్ ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశాలుంటాయి. ఇలాంటి రకరకాల లెక్కలు వేస్తున్న విశ్లేషకులు మరో 10 రోజుల్లో అంటే మే 23న ఫలితాల రోజున అసలు సంగతి తెలుస్తుందని అంటున్నారు విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: