పలితాల రోజు దగ్గరపడే కొద్ది రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. వ్యూహాలు ప్రతివ్యూహాలు పన్ని నరేంద్ర మోడీని ఓడించటానికి మాత్రమే రాజకీయం చేసే మోడీ వ్యతిరేఖులకు కొంచెం భిన్నంగా మోడీని సైతం తనకు సానుకూల వ్యూహంతో రాజకీయాల్లో బందించి తన వైపుకు తిప్పుకునే పద్మవ్యూహం పన్నాడు ఎంకె స్టాలిన్ కరుణానిధి. 
Image result for kcr cbn both remain as jokers in modi politics
తమిళ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత కీలకమైన డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్‌ రాజకీయ అడుగులు ఇప్పుడు తీవ్ర ఆసక్తి రేపుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకున్న స్టాలిన్‌, మరోవైపు జాతీయ స్థాయిలో థర్డ్‌-ఫ్రంట్‌ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తో తాజాగా చెన్నై లో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ లో థర్డ్‌ -ఫ్రంట్‌ దిశ గా ఎంతవరకు చర్చలు జరిగాయన్నది తెలియదు. 
Image result for kcr cbn both remain as jokers in modi politics
అయితే, థర్డ్‌-ఫ్రంట్‌ ఆలోచనే లేదని, ఎన్నికల ఫలితాల తర్వాత ఏదైనా అంటున్న స్టాలిన్‌ గురించి ఇప్పుడో హాట్‌-న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. తనకు బద్ధ విరోధి అయిన బీజేపీతో చెలిమికి సైతం స్టాలిన్‌ సిద్ధమవుతున్నట్టు కథనాలు రావడం తమిళ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. రాజకీయాల్లో మిత్ర శత్రుత్వం అనేవి తమ విజయాలకు పనికివచ్చే పరికరాలే తప్ప వేరే కాదని విఙ్జుల మాట. 
Image result for stalin babu kcr
బహుశ స్టాలిన్ అటు చంద్రబాబునాయుడు ఇటు చంద్రశేఖరరావును గమనిస్తూనే అద్భుతమైన ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు అర్ధమౌతుంది. వీళ్ళిద్దరు రెచ్చిపోతూ చేస్తున్న రాజకీయం జనాలకు పెద్ద నాటకంలాగా కనిపిస్తుంది. ఇద్ధరు చంద్రులు భారత రాజకీయాల్లో పూర్తిగా విశ్వసం కోల్పోయినవాళ్ళే. రెండు కాకులు ఒక రొట్టెముక్క కోసం కొట్టుకుంటుంటే ఒక జిత్తులమారి నక్క తన నోట్లో గుటుక్కున వేసేసుకున్నట్లు - ఇప్పటికి రాష్ట్రం బయట దేశ రాజకీయాల్లో కొంతవరకైనా క్లీన్ ఇమేజ్ ఉన్న స్టాలిన్ కు మంచి చాన్సే దక్కొచ్చు. 
Image result for stalin babu kcr
బహుశ ఏదో రహస్య వ్యూహంతొనే ఈ కరుణానిధి ఆత్మజుడు, బీజేపీతో దోస్తీ దిశగా అడుగులు వేస్తున్నారన్న కథనాల నేపథ్యంలో, ఆయన బీజేపీతో చర్చలు జరిపిన విషయం వాస్తవమేనని ఆ పార్టీ తమిళనాడు చీఫ్‌ తమిళ సై సౌందరరాజన్‌ స్పష్టం చేశారు. అటు కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకొని, ఇటు కేసీఆర్‌ తో మంతనాలు జరుపు తున్న స్టాలిన్‌, మరో పక్క బీజేపీని కూడా లైన్‌ లో పెట్టారన్న కథనాలపై తమిళ రాజకీయాల్లో వాడీవేడి చర్చ జరుగుతోంది. 
Related image
స్టాలిన్‌ బీజేపీతో ఎందుకు చర్చలు జరిపారు? కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారుకు తగినంత మెజారిటీ రాకపోతే, ఆయన మద్దతు ఇస్తారా? స్టాలిన్‌-బీజేపీ చర్చల వెనుక ఆంతర్యం ఏమిటి? అన్నది ప్రస్తుతం రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తి రేపుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడితే తప్ప స్టాలిన్‌ వ్యూహం ఏమిటన్నది స్పష్టంగా తెలిసే అవకాశం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 
Image result for stalin babu kcr
అసలు  స్టాలిన్‌ వ్యూహం అనే చిన్నమాయ నేపధ్యంలో నరేంద్ర మోడీ అనే మహామాయ ఉంటే సాన్నిహిత్యం లేదనుకోవటం కూడా పొరపాటే అందుకే దీని వెనక నమో వ్యూహమే ఉందేమో? ఎవరికి తెలుసు? పలితాలు రావాలి వ్యూహాలు బయటపడాలి అంతే. కరుణానిధి ఆంతర్యంలో నమో ఉన్నారంటారు. ఒకవేళ ఇదే నిజమైతే - ఇద్దరు చంద్రులూ జోకర్లుగా మిగిలిపోవటం ఖాయం.  

Image result for stalin rahul gandhi

అయితే రేపు ఎన్నికల ఫలితాల తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు మళ్లీ ఎన్డీయేలోకి చేరడని - వారు అధికారం లోకి వస్తే మళ్లీ బీజేపీకి దగ్గర కాడని ఎవ్వరూ చెప్పలేరు. ఆఖరికి చంద్రబాబు కూడా ఆ మాట ఇప్పుడు చెప్పలేడు! ఆయనే కాదు! ఇప్పుడు ఎంకే స్టాలిన్ కథ కూడా ఇలానే ఉంది.

Image result for stalin modi meeting

ఒకవైపు  తమిళనాట డీఎంకే- కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. చెరి కొన్ని ఎంపీ సీట్లను ఎంచుకుని పొత్తుతో పోటీ చేశాయి వీరికి ప్రత్యర్థులుగా బీజేపీ-అన్నాడీఎంకేలు  కలిసి పోటీ చేశాయి.ఈ లెక్క ప్రకారం చూసుకుంటే. స్టాలిన్ మద్దతు యూపీఏ కే  ఉండాలి. కానీ ఇప్పుడు స్టాలిన్ కు అవసరం అలాంటి నైతికత కాదు. అధికారం.

Image result for narendra breaks all opponents strategies

ఇప్పటికే డీఎంకే అధికారానికి దూరమై ఎనిమిది సంవత్సరాలు గడిచాయి. ఇలాంటి నేపథ్యంలో కేంద్రం లోనో - రాష్ట్రం లోనో కచ్చితంగా అధికారం ఉండాలి. రాష్ట్రంలో రాజ్యం చక్కగా చలాయించాలన్నా కేంద్రంలో అధికారం కావాల్సిన పరిస్థితి ఉందిప్పుడు.ఈ నేపథ్యంలో.. కేంద్రంలో మళ్లీ ఎన్డీయే  అధికారంలోకి వచ్చే పక్షంలో అటు వైపు జంప్ చేయడానికి కూడా స్టాలిన్ రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు సంప్రదింపులు జరిగినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ దోస్తీకే స్టాలిన్ కట్టుబడి లేడని - కేంద్రంలో కాంగ్రెస్ కు అధికారం అందకపోతే ఆయన  బీజేపీ తో  చేతులు కలపవచ్చని టాక్!

మరింత సమాచారం తెలుసుకోండి: