వైఎస్ రాజశేఖరరెడ్డి అనుయాయుల్లో ఒకరైన ఉండవల్లి అరుణ కుమార్ వైసీపి విజయాన్ని ప్రస్తావిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర లో 50 % ఓట్లు సాధించిన ఏకైక పార్టీ వైసీపి మాత్రమేనని అన్నారు. ఇది  జగన్‌ ప్రజల మూకుమ్మడి అభిమానాన్ని తెలుపు తుందని ప్రశంసించారు. 
Image result for undavalli arun kumar & Jagan
ఢిల్లీలో ఆదివారం మీడియా సమావేశంలో జగన్‌ మాట్లాడిన తీరును చూస్తే:

*ఆయన తండ్రి దివంగత వైఎస్సారే గుర్తుకు వచ్చారని పేర్కొన్నారు. 
*పాలనలో అవినీతి లేకుండా పారదర్శక పాలనను అందిస్తామని చెప్పడం 
*పోలవరం పనులపై జ్యుడిషీయల్‌ బాడీని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. 
*అంతేకాదు పోలవరం ప్రాజెక్టు విషయంలో దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎవరిని సంప్రదించారో వారితోనే సంప్రదించి, వారి సలహా లను స్వీకరించండని జగన్‌కు సూచించారు.


పోలవరం విషయంలో సీనియర్‌ ఇంజినీర్లతో సంప్రదింపులు జరపాలని, జులైలో వచ్చే వరద నుంచి ప్రాజెక్టును కాపాడాలని ఉండవల్లి సూచించారు. పాజిటివ్ ఓట్లతో గెలిచిన ప్రభుత్వాలు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయన్నారు.

Image result for undavalli arun kumar & Jagan
తూర్పు గోదావరిలో ఉండవల్లి అరుణకుమార్‌ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో సామరస్యంగా ఉండడమే మంచి విషయమేనని అభిప్రాయపడ్డారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ₹ 23000 కోట్ల ఆస్తులు ఇప్పటి వరకు ఏపికి రాలేదని గుర్తుచేశారు. వాన్‌-పీక్‌ వైఎస్సార్‌ డ్రీమ్‌ ప్రోజెక్ట్ అని, దాని వల్ల ప్రకాశం, నెల్లూరు జిల్లాలో నిరుద్యోగం సమసిపోతుందని చెప్పారు. సిటీ ప్రాజెక్టును ప్రారంభించిన ఘనత వైఎస్సార్‌ కే దక్కుతుందని పేర్కొన్నారు. 
Image result for vanpic project

Image result for vanpic project

కేరళలో అవినీతికి జరకుండా ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను వైఎస్‌ జగన్‌ ఇక్కడ కూడా అమలుచేస్తే మరో 30ఏళ్లు సీఎంగా ఆయనే కొనసాగుతారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
Image result for undavalli arun kumar & Jagan
"ఎన్నికల్లో టీడీపీకి చెందిన హేమాహేమీలు ఓడిపోయారు. పాజిటివ్ ఓటు తో వచ్చిన ప్రభుత్వాలకు బాధ్యత ఎక్కువగా ఉంటుంది. హిట్ పిక్చర్ అని ప్రచారం జరిగిన సినిమా,  కొంత తేడా వచ్చినా బాగోలేదని అంటారు. అదే ఫెయిల్యూర్ సినిమా కొంచెం బాగోలేక పోయినా బాగుందని అంటారు. జగన్, ప్రభుత్వంలో చిన్న తప్పు జరిగినా.. దాన్ని ప్రజలు పెద్ద తప్పుగానే చూస్తారు. ఈ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వెళ్లాలి. నిన్నా, మొన్నా జగన్ ప్రెస్‌మీట్‌లో అవినీతి మాట్లాడిన విధానం చాలా బాగుంది. అవినీతిరహిత పాలన అందిస్తామని జగన్‌ చెప్పడాన్ని స్వాగతిస్తున్నాను.
Related image
విప్లవాత్మక మార్పులకు జగన్‌ వ్యాఖ్యలు నాంది. ఇసుక మాఫియా ను మొదట అరికట్టాలి. గతంలో అవినీతి నిర్మూలనపై మాజీ సీఎం రాజశేఖరరెడ్డికి కూడా కొన్నిసలహాలు ఇచ్చాను. ప్రతి ప్రభుత్వం కార్యాలయం ముందు అక్కడ పనిచేస్తున్న వాళ్ల జీత భత్యాల సమాచారాన్ని బోర్డు మీద రాయాలి. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేది ప్రజలు. ఉద్యోగులు ప్రజల జీతంతో పనిచేస్తున్నా రన్న విషయం ప్రజలకు తెలియాలి. నేను చెప్పిన విషయం ఆయన నచ్చింది. కానీ ఆయన పక్కన ఉన్న అధికారులకు 
నచ్చలేదు. ఇప్పుడు కూడా నా సూచనపై ఆలోచించాలి’’ అని ఉండవల్లి సలహా ఇచ్చారు.


రాష్ట్ర ప్రభుత్వం పోలవరం రేట్లు పెంచే విషయంపై పీపీఏను సంప్రదించారా? అని అధికారులను అడిగాము. సమాధానం ఇప్పటివరకూ ఇవ్వలేదు. చేసిన పని కన్నా ప్రచారం ఎక్కువ చేసుకోబట్టే చంద్రబాబు ఓడిపోవాల్సి వచ్చింది. వైఎస్‌ జగన్‌ పై ఉన్న లక్షకోట్ల అవినీతి ఆరోపణలను ఓటర్లు ఒప్పుకోలేదు.  ఏడాదిపాటు అసెంబ్లీకి వెళ్లకపోయినా, ఆయన జనం మద్యలో ఉండటంతో జనం ఆయనతో ఉన్నట్లే ఫీల్ అయ్యారు. అందుకే జనం వైఎస్‌ జగన్‌ను భారీ మెజారిటీ తో గెలిపించారు" అని వ్యాఖ్యానించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: