బాబు దెబ్బకు జగన్‌కి చుక్కలే... 

ఈ రోజు ఘనంగా ప్రమాణ స్వీకారం చేసి సీఎం కుర్చీలో కూర్చోగానే జగన్‌కి ఒక షాకింగ్‌ న్యూస్‌ అందబోతుంది.

 మరో రెండు రోజుల్లో జూన్‌ నెల ఖర్చులు చూస్తే మైండ్‌ బ్లాంక్‌... ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు చెల్లించాల్సి ఉంది. మరోవైపు వికలాంగులు, వితంతువులు, వద్ధులు తదితరులకు సామాజిక పింఛన్లు అందించాలి. ఇలా అన్ని కలిపితే తక్షణమే ప్రభుత్వానికి దాదాపు రూ.5,000 కోట్ల వరకు నిధులు కావాలి. సామాజిక పింఛన్ల రూపంలోనే రూ.12వందల కోట్ల వరకు నిధులు అవసరమని ఆర్థికశాఖ అంచనా.


 రాష్ట్ర ఖజానా ఖాళీగా కనిపిస్తోంది. దీంతో ఈ నెల జీతాలు, పింఛన్ల కోసం ఓవర్‌ డ్రాఫ్టునకు వెళ్లాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం చేతిలో రూ100 కోట్లు మాత్రమే ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓవర్‌ డ్రాఫ్టు తప్ప మరో మార్గం కనిపించడం లేదు. 

బాబు ఆడంబరాలు... 


ఎన్నికల సమయంలో చంద్రబాబు హడావడిగా 'పసుపు-కుంకుమ', 'అన్నదాతా సుఖీభవ' చెల్లింపులకు ఎన్నికల ముందు ప్రాధాన్యం ఇవ్వడంతో ఇప్పుడు ఖజానీ ఖాళీ అయిందని అంటున్నారు. నిజానికి బడ్జెట్‌కు అనుగుణంగానే ఖర్చులు పరిమితమై ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, కిందటి ఆర్థిక సంవత్సరం చివర్లో ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పథకాలు. ఆడంబరాల భారం వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడిందని ఆర్థికశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు.

 ఈ కష్టాల నుండి జగన్‌ ప్రభుత్వం ఎలా బైట పడుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: