తెలంగాణ లో టీఆరెస్ , ఆంధ్ర ప్రదేశ్ లో మొన్నటి వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ లు ఆపరేషన్  ఆకర్ష్ పేరిట ప్రజాప్రతినిధులకు గాలం వేసి అభాసుపాలయితే, ఆంధ్ర ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం పార్టీ బలోపేతానికి ప్రజాప్రతినిధుల్ని కాకుండా  కిందిస్థాయి క్యాడర్ ను ఆకట్టుకునేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు కన్పిస్తోంది. ఒక పార్టీ తరుపున గెల్చిన ప్రజాప్రతినిధుల్ని ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు  నయానో, భయానో తమవైపు లాక్కుని, ప్రత్యర్థి పార్టీలను రాజకీయంగా నిర్వీర్యం చేసేందుకు వేసిన ఎత్తుగడలను చూశాం. ఆపరేషన్ ఆకర్ష్ కు బీజం వేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయితే దాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లు పతాకస్థాయి కి తీసుకువెళ్లారు.


ఆపరేషన్ ఆకర్ష్ ను తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా యావత్ దేశ ప్రజలు అసహ్యించుకుంటున్నారు .అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొనసాగిస్తున్న ఈ రాజకీయ క్రీడ కు , ఏపీ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో తగినగుణపాఠం చెప్పారు. 2014 లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున గెల్చి, టిడిపి లో చేరిన వారికి తమ ఓటు తోబుద్ధి చెప్పారు. తాము ఒక పార్టీ ని నమ్మి ఓటేస్తే, గెల్చి తమ స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీ మారిన వారినిఓడించడం ద్వారా ఆపరేషన్ ఆకర్ష్ విధానాన్నితాము

ఎంతగా  అసహ్యించుకుంటున్నామని చెప్పకనేచెప్పారు. ఈ విషయాన్ని యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రహించినట్లు ఉంది . అందుకే ఇతర పార్టీతరుపున గెల్చిన ప్రజాప్రతినిధుల్ని పార్టీ లోకి తీసుకోవడం ద్వారా పార్టీ బలపడుతుందని నమ్మకుండా, కేత్రస్థాయి లోని ఇతర పార్టీల క్యాడర్ ను తమ వైపు తిప్పుకునే ఎత్తుడ వేస్తున్నారు.


ఆర్నెల్ల వ్యవధి లోనే 5 . 6 లక్షల గ్రామ సేవకులు, గ్రామ సెక్రటరీల ఉద్యోగాల్ని భర్తీ చేయాలని భావిస్తోన్నజగన్మోహన్ రెడ్డి, ఈ ఉద్యోగాల ద్వారా కేత్ర స్థాయి లోని ఇతర పార్టీల క్యాడర్ ను తమవైపు తిప్పుకోవచ్చుననిభావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలు, కుల, మతలకు అతీతంగా ఉద్యోగాల్ని ఉద్యోగాల్ని భర్తీచేయనున్నట్లు పేర్కొన్న జగన్, అర్హులైన ఇతర పార్టీలకు చెందిన వారిని కూడా ఉద్యోగాల్లోకి తీసుకోవాలని యోచిస్తున్నారని సమాచారం.  దీనితో కేత్ర స్థాయిలోని ఇతర పార్టీ క్యాడర్ కూడా తమవైపు ఆకర్షితులయ్యేఅవకాశం ఉంటుందని ఆయన  అంచనా వేస్తున్నారని తెలుస్తోంది


కేవలం ప్రజాప్రతినిధుల్ని మాత్రమే నమ్ముకుని ఇప్పటి వరకు అధికారం లో ఉన్న పార్టీ ల అధినేతలురాజకీయాల్ని నెరపగా,  కేత్ర స్థాయిలోని క్యాడర్ ను నమ్ముకుని ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి రాజకీయాలనిచేయాలని యోచిస్తున్నారు. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తోన్నవిషయం తెల్సిందే. పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ లో చేరిన ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాచేసి, ప్రజల వద్దకు వెళ్లి మళ్ళీ బలనిరూపణకు సిద్దపడ్డవారే. ఇక పై కూడా జగన్ మోహన్ రెడ్డి ఇదే విధానాన్నిఅవలంభిస్తూ ఇతరులకు మార్గదర్శనంగా ఉండాలని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: