తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) బలోపేతం బాధ్యతల ను ఆ పార్టీ జాతీయ నాయకత్వం  కేంద్ర హోమ్ శాఖ  సహాయక మంత్రి కిషన్ రెడ్డికి అప్పగించింది.   సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో  బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించడం తో కిషన్ రెడ్డి కి ప్రధాని మోడీ  కేంద్ర మంత్రివర్గం లో స్థానం సాధించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో బలపడాలన్నది కమలనాథుల వ్యూహం. కర్ణాటక లో గతం లో అధికారాన్ని చేజిక్కించుకుని బీజేపీ, లోక్ సభ ఎన్నికల్లో 26  స్థానాలు గెల్చుకుని మరొకసారి సత్తా చాటింది. ఇక తెలంగాణ లో ఆ పార్టీ గతం లో కంటే మెజార్టీ స్థానాలు దక్కించుకోవడం ద్వారా,భవిష్యత్తు లో బలపడేందుకు తమ తదుపరి లక్ష్యంగా తెలంగాణను ఎంచుకుంది. అదే సమయం లో ఆంధ్ర ప్రదేశ్ లోను ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయం పాలవడం తో, తెలుగుదేశం స్థానాన్ని తాము భర్తీ చేయాలని భావిస్తోంది.


ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేత బాధ్యతలను కిషన్ రెడ్డి కి అప్పగించడం వెనుక, ఆయన గతం లోఉమ్మడి ఆంధ్రప్రదేశ్  బీజేపీ అధ్యక్షుడిగా పని చేయడం ఒక కారణంగా తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్బీజేపీ అధ్యక్షుడి గతం లో విస్తృతంగా పర్యటించి, పార్టీ బలోపేతానికి పనిచేసిన కిషన్ రెడ్డి, ఇప్పుడు కేంద్రహోమ్ శాఖ సహాయ మంత్రి హోదా లో అదే పని చేయనున్నారని కమలనాథులు  అంటున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోని నాయకులతోపాటు , క్షేత్ర స్థాయి క్యాడర్ తోను సన్నిహిత సంబంధాలుకలిగి ఉన్న కిషన్ రెడ్డి పార్టీ బలోపేత బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించగలరని  భావిస్తున్నారు.


తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేత బాధ్యతలను ఆ పార్టీ నాయకత్వం అప్పగించగానే, కిషన్ రెడ్డి మొదటతెలంగాణ పై దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే ఆయన తెలంగాణ తెలుగుదేశం నాయకులుపెద్దిరెడ్డి, చాడ సురేష్ రెడ్డి లు పార్టీ లో చేరేవిధంగా మంతనాలు జరిపినట్లు సమాచారం. తెలంగాణ లోతెలుగుదేశం కు భవిష్యత్తు లేకపోవడం తో టి-టిడిపి నాయకులు

కూడా బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఏపీ కి చెందిన ఒక సామజిక వర్గం నాయకులు, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తో తమ వ్యాపారాలకుఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం లో అధికారం లో ఉన్న బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.


ఏపీ లో పార్టీ బలోపేత బాధ్యతలను తాజాగా కిషన్ రెడ్డి కి అప్పగించినప్పటికీ, ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లోబీజేపీ బలోపేత బాధ్యలను రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు చూస్తున్నారు. రాష్ట్రం లో బీజేపీబలోపేత బాధ్యలను  ఆయన కూడా  సమర్ధవంతంగా నిర్వహించారని చెప్పాలి .  గతం అధికారం లో ఉన్నటీడీపీ ప్రభుత్వ కార్యక్రమాలపై ఒంటి కాలిపై లేస్తూ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపేందుకుప్రయత్నించారు. టిడిపి ప్రభుత్వ అవినీతిని ప్రజల్లోకి తీసుకువెల్ళడం లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తో పాటుబీజేపీ కూడా సమర్ధవంతమైన పాత్ర పోషించడం వెనుక జివిఎల్ కృషి ఏంటో ఉందన్నది నిర్వివాదాంశం.


మరింత సమాచారం తెలుసుకోండి: