చంద్రబాబు ఓటమికి సవాలక్ష కారణాలున్నాయి. అమరావతి ల్యాండ్ పూలింగ్, పోలవరం, ఇసుక మాఫియా, సెక్రటేరియట్ నిర్మాణం, ఇరిగేషన్ టెండర్స్ ఇలా అన్నింటిలోనూ అవినీతి జరిగింది. దీనికితోడు ఆయన్ను ఓ వర్గం మీడియా చేసిన అతి తెలుగుదేశం కొంప ముంచింది. 


చంద్రబాబుకు మేలు చేసే ఉద్దేశ్యమో.. లేక ఆయన్ను భ్రమల్లో ఉంచేందుకో తెలియదు కానీ.. ఓ వర్గం మీడియా ఆయన్ను పదే పదే ఆకాశానికి ఎత్తేస్తూ ప్రజలకు దూరం చేసింది. ఆ మీడియా భ్రమల్లోనే ఉన్న చంద్రబాబు వాస్తవాలకు దూరంగా బతికారు. తాను ఏం చేస్తే అదే చాణక్యం.. తాను ఏది తలస్తే.. అదే భవితవ్యం అన్న రేంజ్ కు వెళ్లిపోయారు. 

ప్రజలకు దూరంగా ఇలా ఊహల్లోకి వెళ్లడమే టీడీపీ కొంప కొల్లేరు చేసింది  ఓ వర్గం మీడియాను నమ్ముకొనే బదులు ప్రజల్ని నమ్ముకుని ఉంటే చంద్రబాబు గెలిచేవారు. ప్రచార యావకూ కొన్ని హద్దులుంటాయి. పరిధి దాటితే అది వెగటుగా మారుతుంది. ఐదేళ్లూ ప్రజల్ని మరచిపోయి జగన్, మోదీ, కేసీఆర్ల నామస్మరణతోనే గడిపేశారు. 

చంద్రబాబు అసలు రాష్ట్రంలో ఏమాత్రం బలంగా లేని బీజేపీని ఎక్కువగా టార్గెట్ చేశారు. ఎంత ఎక్కువగా తిడితే మోదీకి అంతలా లాభం కలిగింది. ఇక జనసేనతో లోపాయికారీ పొత్తు కూడా టీడీపీ కొంప ముంచింది. ఆ పొత్తేదో బహిరంగంగా ఉన్న జనం కాస్త జాలి చూపించే వాళ్లేమో. చివరకూ ఇద్దరూ భారీగా నష్టపోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: