నరేంద్ర మోడీ .. చంద్రబాబు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ప్రత్యేకహోదా అంశాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చాడు. ఏపీకి మోడీ ప్రత్యేకహోదా ఇవ్వలేదంటూ చంద్రబాబు నాయుడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత మోడీని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్నికల ప్రచారంలో అంతా మోడీనే విలన్ గా చూపుతూ చంద్రబాబు ప్రచారం సాగించారు.


అయితే ఆ ప్లాన్ వర్కవుట్ కాలేదు.మోడీ మళ్లీ ప్రధాని అయ్యారు చంద్రబాబు నాయుడు కనీసం సీఎంగా కాలేకపోయారు. ఇదంతా బయటకు కనిపించిన దృశ్యం. అయితే మోడీ మాత్రం ఇందులో వేరే లోగుట్టును ప్రస్తావించారట. ఎన్డీయే నుంచి చంద్రబాబు నాయుడు బయటకు రావడం వెనుకే వేరే రీజన్ ఉందని మోడీ అన్నారట.


 అందులో అసలు కథేమిటంటే.. చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి పదవిని లక్ష్యంగా చేసుకున్నారని ప్రధాని కావాలనే స్కెచ్ వేసుకునే చంద్రబాబు నాయుడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారని బీజేపీ కి వ్యతిరేకత పెరిగిందని కంగాళీ కూటమి ఏదైనాకేంద్రంలో అధికారంలోకి వస్తుందని అదే అదునుగా ప్రధాని కావాలని చంద్రబాబు నాయుడు అనుకున్నారని మోడీ తన పార్టీ వారి మధ్యన వ్యాఖ్యానించారట.'చంద్రబాబు ఎన్డీయేను వీడింది ప్రత్యేకహోదా కోసం కాదు ప్రధానమంత్రి కావాలని ఆయన ఎన్డీయే నుంచి ఆయన బయటకు వెళ్లారు..' అని మోడీ వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: