పవన్ కళ్యాణ్ కొన్ని రోజులుగా రెస్టులో ఉన్నారు. ఓటమి తనని సందిగ్ధ పరిస్థితుల్లో పడేసింది. అయితే ఇప్పుడు తాను తన పార్టీ కార్యకలాపాలని ప్రమోట్ చేసుకునేందుకు స్థాపించిన 99 టీవీ కూడా త్వరలో ఎత్తేస్తున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ ని నమ్ముకుని, జనసేనకోసం కెరీర్ ని త్యాగంచేసి పార్టీలోకి వచ్చిన చాలామంది, జనసేన సీనియర్ నేతల దగ్గర తమ గోడు వెళ్లబోసుకుంటున్నారట.

అసలు జనసేన తరఫున గాజువాక, భీమవరం నియోజకవర్గాలలో పోటీ పడేందుకు అరడజను పైన అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు కానీ అనూహ్యంగా పవన్ ఆ నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం అనేది ఆ నేతలకి షాక్ కలిగించే అంశంగా అప్పుడు మారింది అయినా సరే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్యే కాకపోతాడా మన కష్టాలని తీర్చలేకపోతాడా అన్న భావనతో. పవన్ కోసం తప్పుకున్న వారంతా ఇప్పుడు తమ పరిస్థితి ఏంటి అని పవన్ న్నీ నిలదీస్తున్నారు. పవన్ చెప్పకపోయినా పార్టీకోసం శక్తికి మించి డబ్బులు ఖర్చు చేశామని, పవన్ ఎమ్మెల్యే అయిన తర్వాత అంతా సర్దుకుంటుందని భావించామని, ఇప్పుడిలా తేడాకొడితే మాకు దిక్కెవరని వాపోతున్నారు.

అయితే ఈ విషయం పట్ల మాట్లాడి సమస్యలను పరిష్కరించుకుందాం అని భావించిన నేతలు పవన్ తో భేటీ అయినట్టు తెలుస్తుంది. పార్టీ తదుపరి కార్యాచరణ ఏమిటి అని చిన్న స్థాయి నాయకులు పవన్ అభిమానులు నేతల పై ఒత్తిడి చేస్తున్నారు అన్న విషయాన్నీ పవన్ కి చేరవేశారు. అయితే ఆయన మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. కనీసం తాను పోటీచేసిన రెండుచోట్లా ఓడిపోవడాన్ని పవన్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.

ముఖ్యంగా తన బాధ అంత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని గెలిపించుకోలేని క్యాడర్ ఉంటె ఎంత పొతే ఎంత సేవ చేయాలన్న భావన ఉంటె పార్టీలో ఉండండి ఇలా ఆర్థిక సర్దుబాటుల కోసం మాత్రం రాకండి . ఉంటే పార్టీలో ఉండండి, లేకపోతే పొండి అని ఖరఖండిగా చెప్పేశారని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: