టీడీపీ మరియు వైసీపీకి ప్రత్యామ్నాయంగా 2019 ఎన్నికలలో  జనసేన పోటీ చేసింది.కాని ఆశించిన మేర ఫలితాలను రాబట్ట లేకపోయింది.దానితో ఎన్నికల ముందు ఆ పార్టీ లోకి వలస వచ్చిన కొందరు నేతలు ఇప్పుడు ఆ పార్టీ ని విడడానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం.మొదటి నుండి పవన్ తనతో పాటు 25 యేళ్ళ రాజకీయం చేయడానికి సిద్దంగా ఉన్నవారు మాత్రమే తన పార్టీ లోకి రావాల్సిందిగా పిలుపునిచ్చారు.

అప్పట్లో టీడీపీ మంత్రిగా పని చేస్తున్న రావెల కిషోర్ బాబు ఎన్నికల ముందు జనసేనలో చేరారు.కాని జనసేన ఓటమి తో తను పార్టీ వీడుతున్నట్లు తన రాజీనామా లేఖను పవన్ కు పంపారు.అయన ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.అందుకే ఆయన జనసేనను వీడుతున్నట్టు సమాచారం.

ఆయనతో గత కొద్దిరోజులుగా బీజేపీ నాయకులు టచ్ లో ఉన్నారని వారే ఆయన  ఇలాంటి నిర్ణయం తీసుకునేలా ప్రభావితం చేశారని వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే
జనసేన నుండి వలసలు జరుగుతున్నాయి.అది గమించిన బీజేపీ ఆంధ్రాలో బలపడడానికి జనసేన లోని ముఖ్య నేతలను సంప్రదిస్తున్నారని సమాచారం.

జనసేన లోని ముఖ్యనేతల ను తమలో చేర్చుకుంటే పవన్ బలహీన పడుతాడని తద్వారా ఆంధ్రాలో తృతీయ శక్తిగా బిజెపి మారే అవకాశం ఉందని బీజేపీలోని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు అందుకే వారు పవన్ ని చిత్తు చేసే పనిలో నిగ్నమయ్యారు అని సమాచారం.మరి దీనిని పవన్ ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: