త‌మ్మినేని సీతారాం. ఏపీ శాస‌న‌స‌భా కొత్త స‌భాప‌తి. ఏక‌గ్రీవంగా ఎన్నికైన నేత‌. సుదీర్ఘ రాజ‌కీయ నేప‌థ్యం. ఆరు సార్లు ఎమ్మెల్యేగా..తొమ్మిదేళ్లు మంత్రిగా ప‌ని చేసిన అనుభ‌వం. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఏరి కోరి త‌మ్మినేని సీతారాంను ఎంపిక చేసారు. దీనీకి అస‌లు క‌ధ వేరే ఉంది. ఉత్త‌రాంధ్ర బీసీ వ‌ర్గానికి చెందిన త‌మ్మినేని ఎంపికలో సామాజిక స‌మీక‌ర‌ణాల‌తో పాటుగా అస‌లైన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌మూ ఉంది. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ద్వారా త‌మ్మినేని సీతారాంను అధ్య‌క్షా అని పిలిపించాల్సిందే..ఎందుకంటే...

 

టీడీపీ ఆవిర్భావం నుండి త‌మ్మినేని

శ్రీకాకుళం జిల్లాలో ఎర్రంనాయ‌డుతో పాటుగా త‌మ్మినేని టీడీపీ కీల‌క నాయ‌కుడు. పార్టీ ఆవిర్భావం నుండి అయిదు సార్లు ఎమ్మెల్యేగా... తొమ్మ‌ది ఏళ్లు మంత్రిగా ప‌ని చేసారు. ఎన్టీఆర్‌తో పాటుగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలోనూ ప‌ని చేసిన అనుభ వం ఉంది. న్యాయ శాఖ‌తో పాటుగా అనేక కీల‌క శాఖ‌ల‌ను ప‌ర్య‌వేక్షించారు. అయినా..జిల్లాలో టీడీపీ అంత‌ర్గ‌త రాజ‌కీయా ల కార‌ణంగా త‌మ్మినేని అప్ప‌టి వ‌ర‌కు పార్టీకి విధేయుడిగా ఉంటూ ప్ర‌జారాజ్యం ఆవిర్భావ సంద‌ర్భంలో పార్టీ మారాల‌ని నిర్ణ‌యించారు. ఎర్రంనాయుడుతో ఉన్న విబేదాల కార‌ణంగా ఆయ‌న కోసం ప‌ని చేయ‌లేను..టీడీపీకి ద్రోహం చేయ‌లేనని ప్ర‌క‌టించి టీడీపీ వీడారు. ప్ర‌జారాజ్యం నుండి 2009 ఎన్నిక‌ల్లో ఆముదాలవ‌ల‌స నుండి పోటీ చేసారు. ఆ స‌మ‌యంలో త‌మ పార్టీని వీడి త‌మ్మినేని ప్ర‌జారాజ్యంలో చేరటాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు రుచించ‌లేదు. అదే త‌మ్మినేనిని దెబ్బ తీయాల‌ని నాడు నిర్ణ‌యించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: