పై ఈ రోజు  నారా లోకేష్ స్పందన ఇది.
'' దేవుడి స్క్రిప్ట్ లో ట్విస్ట్‌లూ ఉంటాయి జ‌గ‌న్ గారూ!
YS Jagan Mohan Reddy గారూ! దేవుడు స్క్రిప్ట్ రాస్తూ పూర్తిగా ముగించ‌లేదు. రాస్తూ, రాస్తూ కామా పెట్టాడంతే! అది ఫుల్‌స్టాప్ అనుకున్నారు మీరు. ఈ గ్యాప్‌లోనే మీరు గుడినీ, గుడిలో లింగాన్ని మింగేయాల‌నుకుంటున్నారు. 
దేవుడు కామా త‌రువాత మ‌ళ్లీ  స్క్రిప్ట్ రాయ‌డం మొద‌లుపెట్టాడు.
మీరు అవినీతి అన్న ప‌ట్టిసీమ మోటార్లు మీతోనే ఆన్ చేయించాడు. అడ్డ‌గోల‌న్న పోల‌వ‌రం అంచ‌నాలను య‌థాత‌థంగా కేంద్రంతో ఓకే చేయించాడు.
టీడీపీ హ‌యాంలో విద్యుత్ కొనుగోళ్లు అక్రమం అని మీరంటే... 
అవి ముట్టుకుంటే షాక్ కొడ‌తాయ‌ని కేంద్రంతో లేఖ రాయించాడు. దేవుడి స్కిప్ట్ లో ఇటువంటి కామాలు చాలానే ఉంటాయి. 
భ్ర‌మ‌రావ‌తి అన్న మీ భ్ర‌మ‌లు తొల‌గించుకునేందుకు దేవుడే ఓ ఛాన్సిచ్చాడు. సెక్ర‌టేరియ‌ట్‌లో సీఎం సీటులో కూర్చున్న‌ప్పుడైనా, అసెంబ్లీలో అడుగుపెట్టిన‌ప్పుడైనా చంద్ర‌బాబుగారికి మ‌న‌సులో కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకో అని స్క్రిప్ట్ లో మ‌ళ్లీ కామా పెట్టాడు.'' అని తమ Face Book వాల్ పై రాశారు .


మరింత సమాచారం తెలుసుకోండి: