నాగబాబు నర్సాపురం నుంచి ఎంపీగా బరిలోకీ దిగిన సంగతీ తెలిసిందే. అయితే జగన్ సునామీలో అందరిలాగా తాను కూడా కొట్టుకుపోయాడని చెప్పాలి. ఇక ఓటమికి కారణాలపై మాట్లాడిన పవన్ - నాగబాబు..  భీమవరంలో పవన్ ను ఓడించడానికి 150 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. తాము క్లీన్ పాలిటిక్స్ చేశామని.. డబ్బులు పంచలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే నాగబాబు సూత్రం ఎలాగున్నా ఆయన కూడా గత ఎన్నికల్లో భారీగానే ఖర్చు పెట్టారని తాజాగా విడుదల చేసిన రిపోర్ట్ ను బట్టి తెలుస్తోంది.


తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు పార్లమెంట్ - 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేసిన ఎంపీ - ఎమ్మెల్యే అభ్యర్థుల లెక్కలను ఎన్నికల వ్యయ పరిశీలకులు విడుదల చేశారు. ప్రధానంగా మూడు పార్టీలు టీడీపీ - వైసీపీ - జనసేన అభ్యర్థులు కలిపి 9.16 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేకు 28 లక్షలు - ఎంపీ 70 లక్షలు ఖర్చు పెట్టేందుకు అభ్యర్థులకు ఈసీ పరిమితి ఇచ్చింది.


  ఇక మన మెగా బ్రదర్ నాగబాబు నర్సాపురంలో ఎంపీ అభ్యర్థిగా అధికారికంగా రూ.48 లక్షలు ఖర్చు చేసినట్టు లెక్కలు చూపాడని  ఎన్నికల వ్యవ పరిశీలకులు తెలిపారు.  ఇలా క్లీన్ పాలిటిక్స్ - ఖర్చు పెట్టలేదని చెప్పిన నాగబాబు కూడా మోస్తారుగానే ఖర్చు పెట్టారని ఈ లెక్కలను బట్టి తెలుస్తోంది. అయితే ఇది అధికారికం మాత్రమే.. లెక్కలు చెప్పకుండా నేతలు బాగానే ఖర్చు చేస్తుంటారన్న విషయం పొలిటికల్ సర్కిల్స్ లో ఎప్పుడూ నానుతూనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: