పోలవరం.. ఆంధ్రప్రజల జీవనాడి.. ఏపీ సెంటిమెంట్.. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీ సుభిక్షంగా ఉంటుందని జనం నమ్ముతున్నారు. అందుకే దీన్ని శరవేగంగా పూర్తి చేసి చరిత్రలో నిలిచిపోవాలని చంద్రబాబు ప్రయత్నించారు. కానీ కేంద్రంతో సఖ్యత లేకపోవడం వల్ల తన హయాంలో పూర్తి చేయలేకపోయారు.


అయితే పోలవరం టెండర్లలో భారీ అవినీతి చోటుచేసుకుందని ఆరోపించిన జగన్.. తాను అధికారంలోకి రాగానే ఆ అవినీతి గుట్టు తేల్చేపనిలో పడ్డారు. అవసరమైతే రీ టెండర్లకు వెళ్తానని సీఎం అయిన రెండు రోజుల్లోనే జగన్ కుండబద్దలు కొట్టేశారు కూడా.


ఇప్పుడు జగన్ తాను అన్నంత పని చేస్తున్నారు. ప్రస్తుత కాంట్రాక్టర్ ట్రాన్స్‌ట్రాయ్‌తో ఒప్పందాన్ని రద్దు చేసి కొత్తగా టెండర్లను పిలవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై నియమించిన నిపుణుల కమిటీ ఇదే సిఫార్సు చేసినట్లు తెలిసింది.


ప్రధాన కాంట్రాక్టర్ తో ఒప్పందం రద్దయితే ఇక సబ్ కాంట్రాక్టర్లకు అవకాశం ఉండదని, అందువల్ల మొత్తం అన్ని పనులకు కొత్తగా టెండర్లు పిలవాల్సిందేనని ఆ కమిటీ సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. గత 5ఏళ్ల టీడీపీ ప్రభుత్వ కాలంలో తీసుకున్న నిర్ణయాలను, ఉత్తర్వులను శల్య పరీక్ష చేసిన తర్వాతే ఈ కమిటీ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: