మన విత్తనాల పండుగ !!
గుంటూరు జిల్లా, అత్తోట గ్రామంలో ''మన ఊరు - మన విత్తనం'' అనే అరుదైన కార్యక్రమానికి నాంది జరిగింది. ఈ గ్రామంలో బాపారావు అనే యువ రైతు మరికొంతమంది రైతులు కలిసి భారత్‌ బీజ్‌ స్వరాజ్‌ మంచ్‌ శివప్రసాద్‌ సలహాలతో దేశవాళీ విత్తనాల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదొక ఆదర్శనీయమైన ప్రయత్నం.

'' ఇప్పటివరకు 15 మంది రైతులు 100 రకాల దేశీయ వరి విత్తనాలను కాపాడే ప్రయత్నం ఇది . ఈ సంవత్సరం నుంచి మరికొంత మంది రైతులు వీరితో జత కలిసి 200 రకాల విత్తనాలను సేకరించి, జాగ్రత్త చేయబోతున్నారు. ఈ సందర్భంగా విత్తనాలను జాగ్రత్త పరచడం, వాటి అవసరాన్ని రైతులందరికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ విత్తనాల పండుగను బుధవారం జరిపాము.  గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం, అత్తోట గ్రామం లో దేశీ విత్తనాలు సంరక్షించే దిశగా గత 3 సంవత్సరాలుగా 15 మంది రైతులు సంఘటితమై, 100 రకాల దేశీ వరి విత్తన అభివృద్ధి చేస్తున్నాము. ఈ సంవత్సరం  40 మంది రైతులు ముందుకు వచ్చి 200 రకాల దేశీ వరి విత్తనాలను అభివృద్ధి చేయబోతున్నారు.  కార్యక్రమం వల్ల దేశీయ విత్తనాల ఆవశ్యకతను ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరూ తెలుసుకున్నారు.''ఈ   కార్యక్రమాన్ని నిర్వహించిన, బాపారావు అన్నారు.

దేశీయ విత్తనాల కోసం ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన, బాపారావు, శివప్రసాద్‌ , అక్బర్‌లను రైతులు అభినందించారు. ఈ ప్రయత్నం గుంటూరు జిల్లా నుండి రాష్ట్రమంతా విస్తరించాలని, విజయవంతం కావాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: