భారతీయ ప్రజలను అమాయకులుగా జమకట్టి, బీజేపీ ఎంపీలు శనివారం అత్యున్న పార్లమెంట్‌ ఆవరణలో స్వచ్ఛ భారత్‌ అభియాన్‌కు పూనుకున్నారు. ఎంపీలు హేమా మాలిని, కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాగూర్‌లు పార్లమెంట్‌ బయట చీపురుకట్ట చేతబట్టి అటు ఇటు తిప్పుతూ శుభ్రం చేసే ప్రయత్నం చేశారు.

త్వరలో మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా 'స్వచ్ఛ భారత్‌ అభియాన్‌'కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఈ ఎంపీలు ఈ విన్యాసాలు చేశారు. కనీసం చీపురు పట్టుకోవడం కూడా రాని హేమమాలిని ఎలా తుడవాలో తెలీక ఇబ్బంది పడటం వీడియోలో వీక్షించిన నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు చేశారు.

ఈ కార్యక్రమం పై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఒమర్‌ అబ్దుల్లా తనదైన శైలిలో పంచ్‌ వదిలారు. ''దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన ప్రాంతం, పార్లమెంట్‌ వద్ద స్వచ్ఛ భారత్‌ను చేస్తున్నారు. దేశంలో ఎక్కడా కూడా పార్లమెంట్‌ ముందు పాటించిన శుభ్రత పాటించరు. ముఖ్యంగా సమావేశాలు జరిగే రోజుల్లో ఇంకా శుభ్రతను పాటిస్తారు. మీరు మాత్రం అక్కడ ఏముందని శుభ్రం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ? కేవలం ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికే ఈ కార్యక్రమానికి దిగినట్టు ఉంది'' అంటూ ట్విట్టర్లో పోస్ట్‌ చేశారు.

నిజమే కదా , వీరంతా ఏదైనా స్లమ్‌లోకి వచ్చి తుడిస్తే, అసలైన స్వచ్ఛభారత్‌ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇదంతా పబ్లిసిటీ హడావడి తప్ప వారికి చిత్త శుద్దిలేదు అని సోషల్‌ మీడియాలో సెటైర్లు వేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: