జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక.. ఏపీలోని నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జగన్ ఒక్కో రంగంపై దృష్టి సారిస్తూ ఉద్యోగాల ప్రకటనలు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామ వాలంటీర్ పోస్టుల ప్రక్రియ కొనసాగుతోంది.


ఇవి ఓ లక్ష వరకూ ఉంటాయి. వీటి తర్వాత గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. వీటితో పాటు పోలీస్ శాఖ కూడా ఇటీవల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటించింది. ఇక ఇప్పుడు వీటికి తోడు అగ్నిమాపక దళంలోనూ ఖాళీలు నింపే ఆలోచన చేస్తున్నారు.


అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో వాటిని కూడా త్వరలోనే భర్తీ చేస్తామని హోంమంత్రి మేకపాటి సుచరిత తెలిపారు. విజయవాడ లెనిన్ సెంటర్ సమీపంలో జిల్లా ఫైర్ స్టేషన్‌ను సుచరిత శనివారం ప్రారంభించారు. రాష్ట్రంలో మొత్తం 184 ఫైర్ స్టేషన్‌లు ఉన్నాయని.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నట్లు ఆమె తెలిపారు.


ఓఎంజీసీ వంటి గ్యాస్ ప్రాజెక్టులు ఉన్న చోట కూడా కొత్త స్టేషన్లు ఏర్పాటు చేస్తామని హోంమంత్రి సుచరిత తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఫైర్‌ స్టేషన్‌లను త్వరలోనే పూర్తి చేస్తామని.. ఉద్యోగ నియామకాలు చేపడతామని హోంమంత్రి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: