నేడు మనం అనుభవిస్తున్న స్వరాజ్యం ఎందరో అమరవీరుల త్యాగఫలం, చరిత్రపుట అంచుల్లో అక్షరాలుగా మిగిలిన వాళ్ళు ఎందరో,కానీ చరిత్రకు దొరకని దేశక్తులు ఇంకెందరో ఉన్నారు. స్వతంత్ర దినోత్సవం రోజు మాత్రమే వాళ్ళని తలచుకోవడం మనకు అలవాటుగా మారింది అలా కాకుండా ఒక్కసారి వారి జన్మదిన రోజున ఆ త్యాగ మూర్తులను స్మరించుకుందాం.

ఈరోజు బాల గంగాధర తిలక్ మరియు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి. బాల గంగాధర తిలక్ 1856 జులై 23న మహారాష్ట్రాలోని రత్నగిరి లో జన్మించారు. ఈయనని భారత జాతీయోద్యమ పిత గా పిలుస్తారు. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించి గొప్ప సంఘసంస్కర్తగా పేరు తెచ్చుకున్నారు.1916 లో హోంరూలింగ్ ను స్థాపించారు.సమాజంలో చైతన్యం తీసుకు రావడానికి మరాఠా,కేసరి పత్రికలను స్థాపించారు. "స్వరాజ్యం నా జన్మ హక్కు" అని బ్రిటిష్ పాలకులకు ఎదురుగా నినదించారు.

"నా పేరు ఆజాద్" అని స్వాతంత్ర్య కాంక్షను రగిలించాడు చంద్రశేఖర్ ఆజాద్. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని పదేళ్లకే జైలు ఊసలు లెక్కపెట్టిన ఆజాద్.. ఆ తర్వాత విప్లవ పంథా ఎంచుకొని హిందూస్తాన్  సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ స్థాపించారు. 1931 ఫిబ్రవరి 27న తనకు తానే కాల్చుకొని దేశం కోసం ప్రాణత్యాగం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: