2014లో ఏర్పాటైన జనసేన పార్టీని అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మరింత బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక అప్పట్లో టిడిపి పార్టీకి మద్దతు తెలిపిన జనసేన, ఆ ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు కొంత ఆనందపడ్డారు. అయితే ఇటీవల జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన జనసేన పార్టీకి కేవలం ఒకేఒక్క సీట్ లభించడం, అదీకాక అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాలలో కూడా ఘోర పరాజయాన్ని అందుకోవడంతో ఆ పార్టీ నాయకులు కొంత అంతర్మథనంలో పడ్డారు. 

అందుకే ఇకపై పూర్తిగా తన దృష్టిని పార్టీ కార్యక్రమాలపై పెట్టాలని, అలానే పార్టీని ప్రజలకు మరింత చేరువయ్యేలా చేసి, విరివిగా ప్రజలవద్దకు వెళ్లి వారి సమస్యలపై పోరాడాలని అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు సమాచారం. ఇక మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసిపి పార్టీ, తమ పార్టీ కార్యకర్తలైన కొందరిపై తప్పుడు కేసులు పెడుతూ వారిని పలు ఇబ్బందులకు గురిచేస్తోంది అంటూ వారు ఆరోపిస్తున్నారు. ఇక నిన్న భీమవరం మండలం తాడేరు గ్రామానికి చెందిన జనసేన నేత మురళి కృష్ణ ఇటీవల మృతి చెందడంతో అతడి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన జనసేన నాయకుడు నాగబాబు మాట్లాడుతూ, 

జనసేన పార్టీ ప్రజలలోనుండి పుట్టిందని, అలానే పార్టీలో కొందరిపై బలవంతంగా కేసులు పెడ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దయచేసి ఇటువంటి తప్పుడు కేసులు తమ పార్టీ నేతలపై బరాయించవద్దని అయన అధికార పార్టీని కోరారు. ఇక అక్కడి మరికొందరు స్థానిక జనసేన నేతలు కూడా నాగబాబు వెంట రావడం  జరిగింది, వారు మాట్లాడుతూ, ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనసేన ఎప్పుడూ కూడా ప్రజాపక్షాన నిలిచి నిజాలను నిగ్గుతేలుస్తుందని, తమ పార్టీ నేతలు ఎటువంటి బెదిరింపులకు భయపడరని, అనవసరంగా తమ జోలికి వస్తే తాటతీస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేస్తూ మాట్లాడారు........!!   


మరింత సమాచారం తెలుసుకోండి: