పాపం బాబుగోరు ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా  ఆరోగ్య ప‌రీక్ష‌ల నిమిత్తం  అన్ని రకాల టెస్ట్ లు చేయించుకు రావటానికి అమెరికా వెళ్లిన విష‌యం తెలిసిందే. ఇంతలోనే ఓ టీడీపీ వీర విధేయుడు..  క‌డ‌ప జిల్లా కీల‌క నేత వీర శివారెడ్డి  టీడీపీకి గుడ్ బై చెప్పి చెప్పడం..  నిజంగా బాబుకి బాధ కలిగించే అంశమే.  ఉన్నట్లు ఉండి  వీర శివారెడ్డి టీడీపీని వీడటం క‌ల‌క‌లం రేపుతోంది.  ఎందుకంటే గ‌త కొన్నేళ్లుగా క‌డ‌పలో బాబుకి అన్నిరకాలుగా నమ్మకంగా పని చేశారు ఈ సీనియ‌ర్ నేత.  పైగా కడపలో ఈయనకు టీడీపీ క్యాడర్ తో ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంది.  ఇప్పుడు ఆ క్యాడర్ అంతా ఈయనతో పాటే పోతుందేమోనని.. వాళ్ళను ఆపటానికి కడప జిల్లాకి చెందిన మరో కీలక నేతను పురమాయించాడట మన లోకేష్ బాబు.    


అసలు ఇంతకీ  ఈ వీర శివారెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి..   వైసీపీలోకి ఎందుకు  జంప‌వుతున్నారు..?  కారణం తనని బాబు వాడుకోవడం తప్పా.. బాబు తనకు ఏ విధంగా ఉపయోగపడట్లేదు అని ఈయన బాగా ఫీల్ అవుతున్నారట. అందుకు తగ్గట్లుగానే  గ‌త ఎన్నిక‌ల్లో క‌డ‌ప జిల్లా క‌మ‌లాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని చంద్ర‌బాబుని వీర శివారెడ్డి  ఎంత‌గా అడిగినా,  బాబు మాత్రం టిక్కెట్ కేటాయించ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు.  దాంతో గ‌త కొన్ని నెల‌లుగా వీరి శివారెడ్డి పార్టీకి దూరంగా వుంటూ వ‌స్తున్నారు. మొత్తానికి భవిష్యత్తును  వైసీపీలో  ప్లాన్ చేసుకున్నారు.  

  

ఈ  విష‌యం తెలిసి చంద్ర‌బాబు  వీర శివారెడ్డిను  బుజ్జిగించి దారికి తెచ్చుకోవాల‌ని ఆ మధ్య  ప్ర‌య‌త్నించారు.  ఎన్నికల అప్పుడు కూడా ఎమ్మెల్సీ ఇస్తాన‌ని చెప్పి త‌న ప‌ని చేయించుకున్నారు.  అయితే మన బాబుగోరు వ్యక్తిత్వం ఎరిగిన  వీర శివారెడ్డి  చివరికీ  వైసీపీ వైపు వెళ్ల‌డానికే ఆస‌క్తిని చూపించార‌ట‌. దాంతో బాబు కూడా చేసేదేం లేక  కనీసం తన క్యాడర్ నైనా కాపాడుకోవడానికి పావులు కదిపారు. ఇప్పుడు ఆ పావులను లోకేషం ఆచరణలో పెడుతున్నాడు. కానీ  లోకేషం పనితనం తెలిసిందేగా..  క్యాడర్ మొత్తం వీర శివారెడ్డి వైపు వెళ్ళిపోతున్నారట. పాపం లోకేష్. బాబు ఇచ్చిన ఈ చిన్న పనిని కూడా చేయలేకపోయాడు.         


మరింత సమాచారం తెలుసుకోండి: