విజయ్ దేవరకొండ ఒక సారిగా రైజ్ అయిన స్టార్ అతని గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతోంది. అయితే డియర్ కామ్రేడ్ కి మిక్సెడ్ టాక్ రావడంతో  ఫస్ట్ డే నుంచి ఒక వర్గం టార్గెట్ చేసింది. కొందరు హీరోల అభిమానులు ఎక్కువగా ఈ దూకుడు చూపుతున్నారు. అతని ఎదుగుదలను తట్టుకోలేక పోతున్నారా. ఇంతకీ విజయ్ దేవరకొండను టార్గెట్ చేసిన ఆ రైవల్ హీరోలెవరు.డియర్ కామ్రేడ్ హీరోకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారాలు వస్తున్నాయి. ఆయన ఎదుగుదలను చూసి టాలీవుడ్ లో కొందరు హీరోలు తట్టుకోలేక తమ అభిమానులతో దేవరకొండకి వ్యతిరేకంగా రచ్చ చేయిస్తున్నారట.



సరిగ్గా మూడేళ్లక్రితం సోలో హీరోగా తొలి హిట్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. మూడేళ్ల గ్యాప్ లోనే యూత్ ని తన వైపు తిప్పుకున్నాడు. తను చేసిన సినిమాలతో సినిమా కోసం చేసిన ప్రమోషన్ లతోయువతకి తెగ నచ్చేశాడు. ఈ క్రమంలోనే వచ్చింది డియర్ కామ్రేడ్. అయితే తొలి రోజే ఈ సినిమాకీ డివైడ్ టాక్ వచ్చిన మాట వాస్తవం. క్రిటిక్స్ కూడా నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు. దాన్ని విజయ్ దేవరకొండ కూడా యాక్సెప్ట్ చేశాడు. అయితే ఈ సినిమాని ఖిల్ చేసేందుకు విజయ్ దేవరకొండ పనైపోయిందంటూ సోషల్ మీడియాలో కొందరు హీరోల అభిమానులు గత శుక్రవారం నుంచి ప్రతి రోజూ పోస్టులు పెడుతున్నారు. విజయ్ దేవరకొండని మొదట అన్ని వర్గాల హీరోలు యాక్సెప్ట్ చేశారు.


అయితే అర్జున్ రెడ్డితో స్టార్ గా మారడం ఆ తరవాత గీతగోవిందం సినిమాతో భారీ హిట్ కొట్టడంతో జెలసీ మొదలైంది. ముఖ్యంగా కొందరు యువ హీరోలు విజయ్ దేవరకొండ రైజ్ ని తట్టుకోలేకపోతున్నారట. అందుకే తమ టీమ్ తమఅభిమానులతో సోషల్ మీడియాలో నోట సినిమా నుంచే బ్యాడ్ చెయ్యడం మొదలు పెట్టారు. డియర్ కామ్రేడ్ సినిమాతో సౌత్ అంతా మార్కెట్ పెంచుకోవాలని వీజయ్ స్కెచ్ వేయడంతో ఆ వర్గం నెగిటివ్ టాక్ స్కెచ్ చేశారట. అలా మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో డియర్ కామ్రేడ్ హీరోకి వ్యతిరేకంగా మొదలైంది వార్. మొత్తానికి ఈ కుర్ర హీరో పాపులారిటీతో ఇండస్ట్రీలో కొందరు తట్టుకోలేక పోతున్నారని అర్థమవుతోంది. మరి విజయ్ దేవరకొండ వీటికి ఎలా రియాక్ట్ అవుతాడో ఇక పై కెరీర్ ని పకడ్బందీగా ప్లాన్ చేసుకొని భారీ హిట్స్ కి రెడీ అవుతాడా అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: