అన్న క్యాంటీన్ల మూసివేత ఇప్పుడు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. నిజానికి ప్రభుత్వం అన్న క్యాంటీన్ల మూసివేత నిర్ణయాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా, కొన్ని పధకాల పేర్లు మార్చడం లేదా వాటిని పూర్తిగా రద్దు చెయడం మనం చూస్తూనే ఉన్నాము. జగన్ సర్కార్ కూడా గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఎన్నికల చివరి కాలంలో అమలు చేసిన కొన్ని పధకాలను రద్దు చేసింది.

రైతులకు నేరుగా డబ్బు బదిలీ చేసే అన్నదాత సుఖీ భవ కావొచ్చు, లేదా మైఖ్యమంత్రి నిరుద్యోగ భృతి కావొచ్చు. నిజానికి ఇటువంటి పధకాలను రద్దు చేసినందుకు ఎవరు పెద్దగా భాద పడలేదు. ఆందోళన చెందలేదు. ఎందుకంటే సుఖీభవ పధకానికి బదులు జగన్ కొత్త పధకాన్ని తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి నిరుద్యోగ భృతి పథకం అమలు చేసే బదులు యువతకు ఉద్యోగాలు కలిపిస్తే సరిపోతుందని జగన్ భావించి గ్రామా సచివాలయాలు అని ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టారు. 


అయితే జగన్ ఎన్ని పథకాలు రద్దు చేసిన పెద్ద వ్యతిరేకత రాలేదని గాని ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అన్న క్యాంటీన్ల  మూసివేత మాత్రం గురించి చాలా మంది నుంచి వ్యతిరేకత వస్తుంది. అన్న క్యాంటీన్ల పేద ప్రజల ఆకలి తీర్చేవి. ఎటువంటి పధకాలను అమలు చేసిన చేయిపోయిన పేద ప్రజల కడుపును మాత్రం కొట్టకూడదు. ఈ ప్రభత్వాన్ని ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారు. ఇలా చేస్తే మాత్రం ఇందుకా గెలిపించింది అని అందరూ అభిప్రాయ పడతారు. నిజానికి అన్న క్యాంటీన్లలో అవినీతి జరిగితే కొత్తవి ఏర్పడే వరకు అయిన వీటిని కొనసాగించాలి. ఏ ప్రభుత్వానికి పేద ప్రజల ఉసురు తగలకూడదు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వ సంభందిత అధికారులు, మంత్రులు దిద్దుబాటు చర్యలు తీసుకుంటే మంచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: